SSC MTS Notification 2024 : ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 8326 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఎంటీఎస్ - 4887
- హవల్దార్ - 3439
- మొత్తం పోస్టులు - 8326
విద్యార్హతలు
SSC MTS Qualifications : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
SSC MTS Age Limit :
- ఎంటీఎస్ అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 1 నాటికి 18-25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- హవల్దార్ సహా, కొన్ని ఎంటీఎస్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 - 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SSC MTS Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతభత్యాలు
SSC MTS Salary : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులు రెండూ లెవల్-1 ఉద్యోగాల కిందకు వస్తాయి. వీరికి మూలవేతనం రూ.18,000 ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతరల అలవెన్స్‌లు అన్నీ కలిపితే, మొదటి నెల నుంచే రూ.35,000 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం
SSC MTS Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, అర్హులను ఎంటీఎస్, హవల్దార్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ) : హవల్దార్ పోస్టులకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ చేస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో, మహిళలు ఒక కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) : పురుషులు 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం కనీసం 5 సెం.మీ, పెరిగి 81 సెం.మీకు తక్కువ కాకుండా ఉండాలి. మహిళలు 152 సెం.మీ ఎత్తు, 48 కిలోల బరువు ఉండాలి.
దరఖాస్తు విధానం
SSC MTS Application Process :
- ముందుగా మీరు https://ssc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- హోం పేజ్‌లోని SSC MTS & Havaldar Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
- మీరు కనుక న్యూ యూజర్ అయితే, మీ పేరు, వయస్సు, కేటగిరీలను నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- ఇలా రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీ ఈ-మెయిల్, ఫోన్ నంబర్లకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్లు వస్తాయి.
- వీటితో మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్‌లో రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
SSC MTS Apply Last Date :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 జూన్ 27
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జులై 31
- అప్లికేషన్ కరెక్షన్ విండో : 2024 ఆగస్టు 10, 11
- పరీక్ష తేదీ : 2024 అక్టోబర్ - నవంబర్
HCLలో ఉద్యోగాలు- ఆ కోర్స్‌లు చేసిన వారే అర్హులు- లాస్ట్ డేట్ ఎప్పుడంటే? - HCL Recruitment 2024