SSC JE Jobs 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 968 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖల్లో/ సంస్థల్లో గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- జేఈ (సివిల్), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438
- జేఈ (ఎలక్ట్రికల్ & మెకానికల్), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37
- జేఈ (సివిల్), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ : 02
- జేఈ (మెకానికల్), సెంట్రల్ వాటర్ కమిషన్ : 12
- జేఈ (సివిల్), సెంట్రల్ వాటర్ కమిషన్ : 120
- జేఈ (ఎలక్ట్రికల్), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ : 121
- జేఈ (సివిల్), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ : 217
- జేఈ (ఎలక్ట్రికల్), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ : 02
- జేఈ (సివిల్), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ : 03
- జేఈ (మెకానికల్), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ : 03
- జేఈ (ఎలక్ట్రికల్), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ : 03
- జేఈ (ఎలక్ట్రికల్), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ : 02
- జేఈ (సివిల్), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ : 02
- జేఈ (సివిల్), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ : తర్వాత తెలియజేస్తారు.
- జేఈ (ఎలక్ట్రికల్ & మెకానికల్), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.
- జేఈ (సివిల్), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ : 06
- మొత్తం పోస్టుల : 968
విద్యార్హతలు
SSC JE Qualifications : అభ్యర్థులు సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివి ఉండాలి. లేదా తత్సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి
SSC JE Age Limit : సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు గరిష్ఠంగా 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరితుల్లో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SSC JE Application Fee : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
జీత భత్యాలు
SSC JE Salary : సెవెన్త్ పే స్కేల్ ప్రకారం, జూనియర్ ఇంజినీర్లకు నెలకు రూ.35,400- రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం
SSC JE Selection Process : అభ్యర్థులకు ముందుగా పేపర్-1, పేపర్-2 రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జేఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
SSC JE Exam Pattern : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2లు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. పేపర్-1లో 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు) జనరల్ ఇంజినీరింగ్ (100 ప్రశ్నలు) విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. పేపర్-2 మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో దానికి 3 మార్కులు చొప్పున ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
- తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
- ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్ష కేంద్రాలు : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు విధానం
SSC JE Application Process :
- అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి.
- ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- వివరాలు అన్నీ మరోసారి చెక్‌చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
SSC JE Apply Dates :
- ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 28
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్ 18
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 2024 ఏప్రిల్ 19
- దరఖాస్తు సవరణ తేదీలు : 2024 ఏప్రిల్ 22 నుంచి 23
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-I) : 2024 జూన్ 4