ETV Bharat / education-and-career

SBIలో 1100 పోస్టులు - అప్లైకు మరో 4 రోజులే ఛాన్స్ ​- పూర్తి వివరాలివే! - SBI Recruitment 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 11:47 AM IST

SBI Recruitment 2024 Notification : స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా ఇటీవల భారీ ఉద్యోగ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మేనేజర్, ఆఫీసర్, క్లర్క్, ఎకనామిస్ట్, బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోస్టులు ఎన్ని? అప్లైకు లాస్డ్ డేట్ ఎప్పుడు? వంటి పలు వివరాలు మీకోసం.

SBI Recruitment 2024
SBI Recruitment 2024 (ANI)

SBI Recruitment 2024 Notification : మేనేజర్, ఆఫీసర్, క్లర్క్, ఎకనామిస్ట్, బ్యాంకింగ్ అడ్వైజర్ తదితర 1100 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్​ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు sbi.co.in అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎకనామిస్ట్ అండ్​ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు ఆగస్టు 6; వీపీ వెల్త్, మేనేజర్​తోపాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఆగస్టు 8 చివరి తేదీ. ఆఫీసర్స్/ క్లరికల్ కేడర్​లో 8 విభాగాలు, క్రీడలకు స్పోర్ట్స్ పర్సన్ నియామకం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 14న ముగుస్తుంది. మరి ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు, ఇతర వివరాలు మీకోసం.

పోస్టుల వివరాలు ఇలా!

  • వీపీ వెల్త్ : 643 పోస్టులు
  • రిలేషన్​షిప్ మేనేజర్ : 273 పోస్టులు
  • క్లరికల్ (స్పోర్ట్స్ పర్సన్ ) : 51 పోస్టులు
  • ఇన్వెస్ట్​మెంట్ ఆఫీసర్ : 39 పోస్టులు
  • రిలేషన్​షిప్ మేనేజర్ - టీమ్ లీడ్ : 32 పోస్టులు
  • ఇన్వెస్ట్​మెంట్ స్పెషలిస్ట్ : 30 పోస్టులు
  • ఆఫీసర్స్ (స్పోర్ట్స్ పర్సన్ ) : 17 పోస్టులు
  • రీజినల్ హెడ్ : 6 పోస్టులు
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) : 2 పోస్టులు
  • సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్ ): 2 పోస్టులు
  • ప్రాజెక్ట్ డెవలప్​మెంట్ మేనేజర్ (బిజినెస్) : 2 పోస్టులు
  • ఎకనామిస్ట్ : 2 పోస్టులు
  • డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - ఆర్మీ : 1 పోస్టు
  • ప్రాజెక్ట్ డెవలప్​మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) : 1 పోస్టు

అర్హత ప్రమాణాలు ఇవే!

  • వీపీ వెల్త్, మేనేజర్, ఇతర పోస్టులు : పోస్టుల వారీగా పూర్తి అర్హత ప్రమాణాలను కింది అధికారిక నోటిఫికేషన్​లో తెలుసుకోవచ్చు.
  • ఆఫీసర్స్ (స్పోర్ట్స్ పర్సన్) : గత మూడేళ్లలో అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించి ఉండాలి.
  • క్లరికల్ (క్రీడాకారులు) : జాతీయ ఈవెంట్​లో రాష్ట్రానికి లేదా రాష్ట్ర స్థాయి ఈవెంట్లో జిల్లాకు లేదా ఇంటర్ యూనివర్శిటీ ఈవెంట్​లో డిస్టింక్షన్​తో విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా డిస్టింక్షన్​తో కంబైన్డ్ యూనివర్సిటీస్ టీమ్​లో సభ్యుడిగా ఉండి ఉండాలి.
  • ఎకనామిస్ట్ : ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్/ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ ఫైనాన్షియల్ ఎకనామిక్స్లో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేమస్ నుంచి తత్సమాన గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - ఆర్మీ : అధికారిక నోటిఫికేషన్​లో పేర్కొనలేదు.

ఎంపిక విధానం
స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్​మెంట్​కు షార్ట్ లిస్టింగ్, అసెస్​మెంట్​ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపిక కోసం మూడు పారామీటర్లను ఉపయోగిస్తారు. వీటిలో గుర్తింపు పొందిన క్రీడా విజయాల మదింపు, జనరల్ ఇంటెలిజెన్స్ / గేమ్ / పర్సనాలిటీ పరిజ్ఞానం, యక్టివ్​నెస్​, శారీరక దృఢత్వం ఉంటాయి.

  • ఇంటర్వ్యూ ఆధారంగా ఆర్థికవేత్తలు, డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్​కు 100 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది.
  • వీపీ వెల్త్, మేనేజర్, ఇతర పోస్టులకు షార్ట్​లిస్టింగ్, ఇంటర్వ్యూ కమ్ సీటీసీ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్​ను ఉపయోగించి ఫీజు చెల్లింపు చేయవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రూ.1లక్ష జీతంతో - GAILలో 391 నాన్​-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - GAIL Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - వెస్ట్​ సెంట్రల్​ రైల్వేలో 3,317 పోస్టులు - Central Railway Notification 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.