SAIL Recruitment 2024 : మహారత్న హోదా కలిగిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 108 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- సీనియర్ కన్సల్టెంట్
- కన్సల్టెంట్
- సీనియర్ మెడికల్ ఆఫీసర్
- మెడికల్ ఆఫీసర్ (ఓహెచ్ఎస్)
- అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)
- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బోయిలర్)
- మైనింగ్ ఫోర్‌మెన్
- సర్వేయర్
- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (మైనింగ్)
- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)
- మైనింగ్ మేట్
- అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ
విద్యార్హతలు
అభ్యర్థుల విద్యార్హతలు ఆయా పోస్టులను బట్టి ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు. అయితే గరిష్ఠ వయస్సు అనేది ఆయా పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు కూడా వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
- ఈ1 - ఈ4 గ్రేడ్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
- ఎస్-3 గ్రేడ్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.
- ఎస్-1 గ్రేడ్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ చేస్తారు. తరువాత వారిని ఇంటర్వ్యూ చేసి, అర్హులను సంబంధిత పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
SAIL Jobs Application Process :
- అభ్యర్థులు ముందుగా సెయిల్ అధికారిక వెబ్సైట్ https://www.sail.co.in/ ఓపెన్ చేయాలి.
- మీరు కొత్త యూజర్ అయితే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలి.
- అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది.
- ఈ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఏప్రిల్ 16
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మే 7
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటీస్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024