ETV Bharat / education-and-career

టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 5066 ఉద్యోగాలు - రాత పరీక్ష, వైవా లేదు! - RRC WR Apprentice Recruitment 2024

RRC WR Apprentice Recruitment 2024 : రైల్వేలో 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRC WR Apprentice Recruitment 2024
RRC WR Apprentice Recruitment 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 11:16 AM IST

Updated : Sep 21, 2024, 2:48 PM IST

RRC WR Apprentice Recruitment 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్‌ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఎంపికయ్యే వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్​షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హతలేంటి? ఆఖరి తేదీ ఎప్పుడు? ఫీజు ఎంత? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.

డివిజన్‌/ వర్క్‌షాప్‌లు :
బీసీటీ డివిజన్, బీఆర్‌సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్‌టీఎం డివిజన్, ఆర్‌జేటీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్‌ వర్క్‌షాప్, ఎంఎక్స్‌ వర్క్‌షాప్, బీవీపీ వర్క్‌షాప్, డీహెచ్‌డీ వర్క్‌షాప్, పీఆర్‌టీఎన్‌ వర్క్‌షాప్, ఎస్‌బీఐ ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్, ఎస్‌బీఐ సిగ్నల్ వర్క్‌షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్ వంటి డివిజన్లలోని అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు.

విద్యార్హత : పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసవ్వాలి. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్ వంటి ఐటీఐ ట్రేడ్​ల్లో ఉత్తీర్ణుతులైనవారు ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : దరఖాస్తుదారుడి వయసు అక్టోబరు 10 నాటికి 15- 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ వంటివి ఉండవు.

దరఖాస్తు ఫీజు : ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మహిళా, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం : 2024 సెప్టెంబర్​ 23
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 22

Last Updated : Sep 21, 2024, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.