ETV Bharat / education-and-career

ఇంటర్​, డిగ్రీ అర్హతతో - రైల్వేలో 11,558 పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB NTPC Recruitment 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 10:24 AM IST

RRB NTPC Recruitment 2024 : రైల్వే జాబ్స్​ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఆర్​ఆర్​బీ 11,558 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్‌/ అండర్‌ గ్రాడ్యుయేట్‌)కి సంబంధించిన ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు మీ కోసం.

Indian Railways
RRB NTPC (ANI)

RRB NTPC Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 11,558 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్‌/ అండర్‌ గ్రాడ్యుయేట్‌)కి సంబంధించిన ఈ పోస్టుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

I .గ్రాడ్యుయేట్ పోస్టులు :

  • కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ - 1,736 పోస్టులు
  • స్టేషన్ మాస్టర్ - 994 పోస్టులు
  • గూడ్స్ రైలు మేనేజర్ - 3,144 పోస్టులు
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 1,507 పోస్టులు
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 732 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య - 8,113

విద్యార్హతలు : సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.

వయోపరిమితి : 2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం : నెలకు రూ.29,200 - రూ.35,400

II. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు :

  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - 2,022 పోస్టులు
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 361 పోస్టులు
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 990 పోస్టులు
  • ట్రైన్స్ క్లర్క్ - 72 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య - 3,445

విద్యార్హతలు : 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం : నెలకు రూ.19,900 - రూ.21,700

ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము : జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. మహిళలు, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 ఫీజు కట్టాలి.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

దరఖాస్తు విధానం

  • ముందుగా మీరు ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • RRB NTPC Recruitment 2024 లింక్​పై క్లిక్ చేయాలి.
  • మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్​లను ఎంటర్​ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక ఎన్​రోల్​మెంట్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • వీటితో మళ్లీ ఆర్​ఆర్​బీ పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

I. గ్రాడ్యుయేట్ పోస్టులకు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్​ 19
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 13

II. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్​ 21
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 20

నోట్‌ : నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు సెప్టెంబర్‌ 14న వెల్లడికానున్నాయి.

SSC భారీ నోటిఫికేషన్​ - పదో తరగతి అర్హతతో - 39481 (GD) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ! - SSC GD Notification 2025

10వ తరగతి అర్హతతో - ITBPలో 819 కానిస్టేబుల్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - ITBP Constable Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.