ETV Bharat / education-and-career

మీరు విద్యార్ధులా! అయితే RBI 10 లక్షల బహుమతి మీదే- ఈ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోండి - Reserve Bank of India offers prizes - RESERVE BANK OF INDIA OFFERS PRIZES

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విద్యార్థులకు అద్బుత అవకాశాన్ని కల్పించింది. విద్యార్ధుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జాతీయ స్థాయి క్విజ్‌పోటీలను నిర్వహించనుంది. ఆర్బీఐ 90వ వార్షికోత్సవం వేళ దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు ‘RBI90’ పేరుతో ఈ అంతర్జాల క్విజ్‌పోటీ జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. ఆసక్తి, ఉత్సాహం ఉన్న విద్యార్ధులు ఈ కింద పేర్కొన్న వైబ్‌సైట్‌ అధికారిక లింక్‌ ద్వారా వెంటనే అప్లై చేయండి.

RBI 10 లక్షల బహుమతి
RBI 10 లక్షల బహుమతి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 10:41 AM IST

Updated : Sep 17, 2024, 11:51 AM IST

RBI ONLINE QUIZ COMPENSATION : విద్యార్ధుల మేథాశక్తిని పరీక్షించేందుక భారత రిజర్వు బ్యాంకు విన్నూత కార్యక్రమాన్ని ప్రకటించింది. డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు RBI90 పేరిట నిర్వహించే ఆన్‌లైన్‌ క్విజ్‌పోటీల్లో విజేతలై లక్షల రూపాయల బహుమతులు సొంతం చేసుకునే సువర్ణ అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 17తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంటుంది.ఈ నెల 19 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఈ క్విజ్‌ కాంపిటేషన్‌ జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు డీగ్రీ కళాశాలల విద్యార్థులు మెదడుకు పదునెడితే 10 లక్షల మొదట ఫ్రైజ్‌ను, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్ధికి 8లక్షలు, తృతీయ స్థానం విద్యార్ధికి 6లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది.

RBI 10 లక్షల బహుమతి
RBI 10 లక్షల బహుమతి (ETV Bharat)

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇలా

2024 సెప్టెంబరు 1 నాటికి 25 ఏళ్ల వయసు ఉండి ఏదైనా కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు ఈ పోటీలకు అర్హులు. విద్యార్ధులు సొంతంగా https://www.rbi90quiz.in/ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. https://www.rbi90quiz.in/ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంపిక చేయగానే రిజిస్ట్రేషన్‌ పేజీ ఓపెన్‌ అవుతోంది. మీ రాష్ట్రం, మీ జిల్లా, మీ కళాశాల పేరు నమోదు చేయాలి. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరి పేర్లు పొందుపర్చాలి. విద్యార్ధి గుర్తింపు కార్డు, పర్సనల్‌ ఈమెయిల్, ఫోన్‌నెంబర్, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి. ఇలా అప్లికేషన్‌లో కోరిన సమగ్ర సమాచారాన్నిపొందుపరిచిసబ్మిట్‌ నొక్కితే సరిపోతుంది. ఇందుకు గానూ ఎలాంటి రుసుమూ లేదు.

RBI 10 లక్షల బహుమతి
RBI 10 లక్షల బహుమతి (ETV Bharat)

క్విజ్‌ పోటీ విధానం

ఈ క్విజ్‌ పోటీలో పాల్గొనేందుకు ఒక కళాశాల నుంచి ఎంతమందైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఒక బృందానికి కనీసం ఇద్దరు ఉండాలి. మొత్తం నాలుగు దశల్లో పోటీ ఉంటుంది. తొలుత ప్రతి జిల్లా స్థాయి, ఆన్‌లైన్‌ దశ ప్రారంభమై రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆంగ్లం, హిందీ భాషల్లో పోటీ ఉంటుంది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, RBIడిజిటల్‌ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, క్రీడలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, సమకాలీన అంశాలు క్విజ్‌ కాంపిటేషన్‌లో ప్రశ్నలు సంధిస్తారు.

అధికారిక విద్యార్ధి రిజిస్ట్రేషన్‌ లింక్‌: https://www.rbi90quiz.in/students/register

యూపీఐ తరహాలో ULI - ఇకపై మరింత ఈజీగా బ్యాంక్ లోన్స్​!

వీసా, మాస్టర్ కార్డు, రూపే- ఇకపై క్రెడిట్ కార్డ్ సెలక్షన్ మీదే గురూ!

Last Updated : Sep 17, 2024, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.