ETV Bharat / education-and-career

విద్యార్థులకు బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.6 లక్షల స్కాలర్​ షిప్! - ఇలా గెలుచుకోండి! - Reliance Foundation Scholarship - RELIANCE FOUNDATION SCHOLARSHIP

ప్రతిష్ఠాత్మక రిలయన్స్​ ఫౌండేషన్​ 2024-25 విద్యా సంవత్సరానికి స్కాలర్​షిప్స్ ప్రకటించింది. రూ.2లక్షలు, రూ.6లక్షల వరకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు ప్రకటించింది. మరి ఈ స్కాలర్​షిప్ కోసం ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

reliance foundation scholarship
reliance foundation scholarship (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 4:32 PM IST

Reliance Foundation Scholarship : ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్​ ఇండస్ట్రీస్ కంపెనీకి సంబంధించిన "రిలయన్స్ ఫౌండేషన్"..​ ఉన్నత విద్య చదివేవారికి గుడ్​ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులకు స్కాలర్​ షిప్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మొత్తం 5,100 మందికి ఈ ఉపకార వేతనం అందజేయనున్నట్టు తెలిపింది. ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదవబోతున్న 5 వేల మంది విద్యార్థులకు రూ.2లక్షల వరకు.. డిగ్రీ పూర్తి చేసి పీజీ చదవబోతున్న 100 మంది విద్యార్థులకు రూ.6లక్షల వరకు స్కాలర్​షిప్​లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులకు ఆప్టిట్యూడ్​ పరీక్ష పెట్టి, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్కాలర్ షిప్ అందించనున్నారు. వచ్చే పదేళ్లలో 50వేల స్కాలర్​షిప్​లు అందిచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్మన్​ నీతా అంబానీ తెలిపారు. స్కాలర్​షిప్​ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

డిగ్రీ స్కాలర్​షిప్​ కోసం అర్హులు ఎవరంటే?

  • భారత దేశ పౌరులై ఉండాలి.
  • ఇంటర్​లో కనీసం 60శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
  • 2024-25 విద్యా సంవత్సరంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో చేరి ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.15లక్షల లోపు ఉండాలి(రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం)
  • ఆప్టిట్యూడ్​ టెస్ట్​లో మంచి మార్కులు సాధించాలి.

వీరు అనర్హులు..

  • ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు
  • ఆన్​లైన్​, హైబ్రిడ్​, రిమోట్, దూరవిద్య లేదా మరే ఇతర నాన్ రెగ్యులర్​ పద్ధతిలో చదువుతున్న వారు
  • పదో తరగతి తర్వాత డిప్లొమా చేసినవారు
  • రెండేళ్ల డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థులు
  • ఆప్టిట్యూడ్​ పరీక్ష ఫెయిల్​ అయినవారు లేదా చీటింగ్​ చేసినవారు.

ఎంపిక విధానం..

  • ఆన్​లైన్ పద్ధతిలో విద్యార్థులందరికీ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ నిర్వహిస్తారు.
  • 60 నిమిషాలపాటు సాగే ఈ పరీక్షలో 60 మల్టిపుల్ ఛాయిస్​ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  • ఇందులో వర్బల్​, అనలైటికల్​, లాజికల్, న్యూమరికల్​ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
  • ఆ తర్వాత ఇందులో వచ్చిన మార్కులు, అకడమిక్​ రికార్డు, ప్రతిభ, వ్యక్తిగత వివరాల ఆధారంగా స్కాలర్​షిప్​నకు ఎంపిక చేస్తారు.

పీజీ స్కాలర్​షిప్​నకు ఎవరు అర్హులు?

  • భారత దేశ పౌరులై ఉండాలి.
  • గేట్​ ప్రవేశ పరీక్షలో 550-1000 మధ్య స్కోర్​ సంపాదించి ఉండాలి.
  • గేట్ పరీక్ష రాయని వారు డిగ్రీలో 7.5కన్నా ఎక్కువ సీజీపీఏ సాధించి ఉండాలి.
  • కంప్యూటర్​ సైన్స్, ఆర్టిఫిషియల్​ ఇంటిలిజెన్స్, మాథ్యమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్​, లైఫ్​ సైన్సెస్​ చదువుతున్న విద్యార్థులు అర్హులు
  • ఆప్టిట్యూడ్​ టెస్ట్​లో మంచి మార్కులు సాధించాలి

అనర్హులు ఎవరు?

  • పీజీ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు
  • ఆన్​లైన్​, హైబ్రిడ్​, రిమోట్, దూరవిద్య లేదా మరే ఇతర నాన్ రెగ్యూలర్​ పద్ధతిలో చదువుతున్న వారు
  • గేట్​ ప్రవేశ పరీక్షలో 550కన్నా తక్కువ మార్కులు సాధించినవారు
  • కేవలం మ్యాథమెటిక్స్​ చదువుతున్న వారు.. మాథ్యమెటిక్స్​ అండ్ కంప్యూటింగ్​ విభాగంలో అప్లై చేయడానికి అనర్హులు
  • ఆప్టిట్యూడ్​ పరీక్ష ఫెయిల్​ అయినవారు లేదా చీటింగ్​ చేసినవారు అనర్హులే.

ఎంపిక విధానం..

  • ఆన్​లైన్ పద్ధతిలో విద్యార్థులందరికీ కచ్చితంగా ఆప్టిట్యూడ్​ టెస్ట్​ నిర్వహిస్తారు.
  • 60 నిమిషాలపాటు సాగే ఈ పరీక్షలో 60 మల్టీపుల్ ఛాయిస్​ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

  • ఈ ఆన్సర్​ షీట్​లను సంబంధిత రంగంలో నిపుణులైన వారితో మూల్యాంకనం చేయిస్తారు.
  • ఆ తర్వాత ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా రంగాల్లోని నిపుణులతో ఆన్​లైన్​లో​ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • అనంతరం ఆప్టిట్యూడ్ స్కోర్​, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా స్కాలర్​షిప్​నకు ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ విధానం..

  • ఈ స్కాలర్​షిప్​ కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు www.scholarships.reliancefoundation.org లింక్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అక్కడ కనిపించే Undergraduate Scholarship, Postgraduate Scholarshipలో మీరు అప్లై చేయాల్సిన ఐకాన్​పై క్లిక్ చేయాలి.
  • కిందకు వచ్చాక Click Here To Applyపై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నింపి సబ్మిట్​ చేయాలి.
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2024 అక్టోబర్​ 6

ఇంటర్ పాసైతే ఏడాదికి రూ. 1.5 లక్షల స్కాలర్‌షిప్- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? - kotak kanya scholarship 2024

ఫ్రీగా ల్యాప్​టాప్​- రూ.100కోట్లతో స్కాలర్​షిప్ ప్రోగ్రామ్​​- విద్యార్థులకు ఎయిర్​టెల్​ గుడ్​న్యూస్​ - bharti airtel scholarship program

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.