Railway Jobs 2024 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- కార్పెంటర్ - 38
- కోపా (COPA) - 100
- డ్రాఫ్ట్‌మెన్ (సివిల్) - 10
- ఎలక్ట్రీషియన్ - 137
- ఎలక్ట్రో మెకానిక్ - 5
- ఫిట్టర్ - 187
- మెషినిస్ట్ - 4
- పెయింటర్ - 42
- ప్లంబర్ - 25
- మెకానిక్ (RAC) - 15
- ఎస్ఎండబ్ల్యూ - 4
- స్టెనో (ఇంగ్లీష్) - 27
- స్టెనో (హిందీ) - 19
- డీజిల్ మెకానిక్ - 12
- టర్నర్ - 4
- వెల్డర్ - 18
- వైర్‌మెన్ - 80
- కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ - 4
- డిజిటల్ ఫొటోగ్రాఫర్ - 2
- మొత్తం పోస్టులు - 733
విద్యార్హతలు
SECR Apprentice Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా 10, 10+2తో పాటు, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.
వయోపరిమితి
SECR Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
SECR Apprentice Fee : నోటిఫికేషన్లో దరఖాస్తు రుసుము గురించి ప్రస్తావించలేదు. కనుక అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
SECR Apprentice Selection Process : టెన్త్, ఇంటర్, ఐటీఐల్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాదిపాటు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
SECR Apprentice Application Process :
- అభ్యర్థులు ముందుగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ https://www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
SECR Apprentice Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 12
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్ 12
నిరుద్యోగులకు అలర్ట్ - ఘోస్ట్ జాబ్స్ విషయంలో జర జాగ్రత్త! - Ghost jobs explained