ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో - PNBలో 2700 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - PNB Apprentice Recruitment 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 10:49 AM IST

PNB Apprentice Recruitment 2024 : బ్యాంక్ జాబ్స్​ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో 2700 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదతర పూర్తి వివరాలు మీ కోసం.

BANK JOBS 2024 JULY
PNB Apprentice Recruitment 2024 (ANI)

PNB Apprentice Recruitment 2024 : డిగ్రీలు చేసి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. పంజాబ్ నేషనల్ బ్యాంక్​ 2700 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడవులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • మొత్తం పోస్టులు - 2700
  • ఆంధ్రప్రదేశ్​లోని పోస్టులు - 27
  • తెలంగాణలోని పోస్టులు - 34

విద్యార్హతలు
PNB Apprentice Eligibility : డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి
PNB Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
PNB Apprentice Application Fee :

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు రూ.800 + 18% జీఎస్టీ చెల్లించాలి.
  • దివ్యాంగులు రూ.400 + 18% జీఎస్టీ చెల్లించాలి.
  • మహిళలు, ఎస్టీ, ఎస్సీలు రూ.600 + 18% జీఎస్టీ చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ
PNB Apprentice Selection Process : అభ్యర్థులకు ఆన్​లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష (లోకల్​ లాంగ్వేజ్ టెస్ట్​), మెడికల్ టెస్ట్​ నిర్వహించి, అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం
PNB Apprentice Exam Pattern :

  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్​ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
  • జనరల్ ఇంగ్లీష్​ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
  • జనరల్/ ఫైనాన్సియల్ అవేర్​నెస్​ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
  • కంప్యూటర్​ నాలెడ్జ్​ - 25 ప్రశ్నలు - 25 మార్కులు
  • మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్టైపెండ్​
PNB Apprentice Salary :

  • మెట్రో ఏరియాల్లో పనిచేసే అప్రెంటీస్​లకు రూ.15,000 స్టైపెండ్ ఇస్తారు.
  • అర్బన్ ఏరియాల్లో పనిచేసే వారికి రూ.12,000 ఇస్తారు.
  • రూరల్​, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో పనిచేసే వారికి రూ.10,000 అందిస్తారు.

దరఖాస్తు విధానం
PNB Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా పంజాబ్​ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్​సైట్ https://www.pnbindia.in/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్​లోని కెరీర్స్ సెక్షన్​ని క్లిక్ చేయాలి.
  • PNB Apprentice Posts Apply లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, స్కాన్ చేసిన సిగ్నేచర్​ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
PNB Apprentice Apply Last Date :

  • దరఖాస్తులు ప్రారంభం : 2024 జూన్ 30
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జులై 14

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 6128 పోస్టులతో IBPS భారీ నోటిఫికేషన్​ - అప్లై చేసుకోండిలా! - IBPS Clerk Recruitment 2024

డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? పరీక్ష లేకుండానే గవర్నమెంట్ జాబ్ ఇస్తారంట - వెంటనే అప్లై చేసుకోండి - Delhi PMBI Notification 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.