NTPC Jobs 2024 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) 110 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఎలక్ట్రికల్ ఎరెక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 20 పోస్టులు
- మెకానికల్ ఎరెక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 50 పోస్టులు
- సీ&ఐ ఎరెక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 10 పోస్టులు
- సివిల్ కన్స్ట్రక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 30 పోస్టులు
- మొత్తం పోస్టులు - 110
విద్యార్హతలు
NTPC Deputy Manager Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
NTPC Deputy Manager Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 40 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NTPC Deputy Manager Fee : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, XSM కేటగిరీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
NTPC Deputy Manager Selection Process : ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలి.
జీతభత్యాలు
NTPC Deputy Manager Salary : డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం
NTPC Deputy Manager Online Apply Process :
- అభ్యర్థులు ముందుగా ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ https://careers.ntpc.co.in/recruitment/ ఓపెన్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
NTPC Deputy Manager Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 23
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 8