ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో NIAలో ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Stenographer jobs 2024

NIA Jobs 2024 : డిగ్రీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. నేషనల్ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (ఎన్​ఐఏ) అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్​, అప్పర్ డివిజన్​ క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NIA Recruitment 2024
NIA Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 10:35 AM IST

NIA Jobs 2024 : నేషనల్ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (ఎన్​ఐఏ) అసిస్టెంట్​, స్టెనోగ్రాఫర్​, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆఫ్​​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • అసిస్టెంట్​ - 7 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్​ (గ్రేడ్​ 1) - 24 పోస్టులు
  • అప్పర్ డివిజన్ క్లర్క్ - 9 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 40

విద్యార్హతలు
NIA Job Education Qualification : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థల్లో చదివి, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్​లో పాస్​ అయ్యుండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ను చూడండి.

వయోపరిమితి
NIA Job Age Limit : అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 56 ఏళ్లు మించి ఉండకూడదు.

జీతభత్యాలు
NIA Job Salary :

  • అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఇస్తారు.
  • స్టెనోగ్రాఫర్​ (గ్రేడ్​ 1) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు సాలరీ ఇస్తారు.
  • అప్పర్ డివిజన్ క్లర్క్​ (యూడీసీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం అందిస్తారు.

డిప్యుటేషన్ పీరియడ్​
అసిస్టెంట్​, స్టెనోగ్రాఫర్​, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్లపాటు డిప్టుటేషన్​ బేసిస్​పై పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం
NIA Job Application Process :

  • అభ్యర్థులు NIA వెబ్​సైట్​లోకి వెళ్లి అప్లికేషన్ ఫారమ్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలను కూడా ఈ దరఖాస్తుకు జత చేయాలి.
  • వీటన్నింటినీ ఒక కవర్​లో ఉంచి, ఎన్​ఐఏ కేంద్రానికి పోస్ట్​ చేయాలి.

పంపించాల్సిన చిరునామా : ఎస్​పీ (అడ్మిన్​), ఎన్​ఐఏ హెడ్​క్వార్టర్స్​, సీజీఓ కాంప్లెక్స్​, లోఢీ రోడ్​, న్యూ దిల్లీ-1100003.

నోట్​ : అభ్యర్థులు ఈ విధంగా గడువులోగా ఆఫ్​లైన్​లోనే అప్లికేషన్​ పంపాలి. మరేవిధంగా దరఖాస్తును పంపినా, దానిని తిరస్కరిస్తారు.

ముఖ్యమైన తేదీలు
NIA Job Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 3
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్​ 3 వరకు (వాస్తవానికి దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ నుంచి 2 నెలలలోపు అప్లికేషన్ పంపించాలి.)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - రైల్వేలో 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ!

ఇంటర్​ అర్హతతో ఇండియన్ కోస్ట్​ గార్డ్​లో 260 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.