Indian Coast Guard Jobs 2024 : భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారత తీరరక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) 320 నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 'కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT) - 01/2025' రాయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి ముందుగా శిక్షణ ఇచ్చి తరువాత విధుల్లోకి తీసుకుంటారు.
పోస్టుల వివరాలు
1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
- రీజియన్/ జోన్‌ల వారీగా పోస్టుల వివరాలు : నార్త్- 77; వెస్ట్- 66; నార్త్ ఈస్ట్- 68; ఈస్ట్- 34; నార్త్ వెస్ట్- 12, అండమాన్ అండ్ నికోబార్- 03.
2. యాంత్రిక్ : 60 పోస్టులు
- {మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యునికేషన్ (రేడియో/పవర్)}
విద్యార్హతలు
- నావిక్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
- యాంత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతితో పాటు, సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 2003 మార్చి 1 నుంచి 2007 ఫిబ్రవరి 28 మధ్య జన్మించి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
జీతభత్యాలు :
- నావిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 జీతం ఇస్తారు.
- యాంత్రిక్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.29,200 సాలరీ అందిస్తారు.
ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు నిర్వహిస్తారు. వీటితో ఉత్తీర్ణులైనవారికి శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత ధ్రువపత్రాలను పరిశీలించి, అర్హులైన వారిని నావిక్, యాంత్రిక్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ICG Application Process :
- అభ్యర్థులు ముందుగా ఐసీజీ అధికారిక వెబ్సైట్ https://joinindiancoastguard.cdac.in/cgept/ ఓపెన్ చేయాలి.
- Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 జూన్ 13
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జులై 03
పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ :
- స్టేజ్-I : 2024 సెప్టెంబర్
- స్టేజ్-II : 2024 నవంబర్
- స్టేజ్-III : 2025 ఏప్రిల్
రైల్వేలో 1104 పోస్టుల భర్తీ - రాత పరీక్ష లేకుండానే జాబ్ - అప్లై చేసుకోండిలా! - Railway Jobs 2024