ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో IFS జాబ్స్​- వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు- లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే? - Latest Central Govt Jobs

IFS Jobs 2024 : ఉద్యోగార్థులకు శుభవార్త. ఇండియన్​ ఫారెస్ట్ సర్వీస్​​లో 150 పోస్టులకు సంబంధించి నోటఫికేషన్​ విడుదలైంది. మరి వీటికి దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన విద్యార్హతలు, అప్లికేషన్ ఫీజు, దరఖాస్తు గడువు తదితర వివరాలు మీ కోసం.

IFS Jobs 2024
IFS Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 12:59 PM IST

IFS Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్​న్యూస్​. ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​లో మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్సీ). ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొత్తం ఖాళీలు
IFS Recruitment 2024 Vacancies : 150

విద్యార్హత
IFS Jobs 2024 Educational Qualification : ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు పైపోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఏజ్​ లిమిట్​ (2024 ఆగస్టు 1నాటికి)
IFS Jobs 2024 Age Limit :

  • కనిష్ఠ వయసు- 21 ఏళ్లు
  • గరిష్ఠ వయసు- 32 ఏళ్లు
  • రిజర్వేషన్​ల ఆధారంగా ఆయా కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్​ ఫీజు
IFS Jobs 2024 Application Fee : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు- ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. మిగతా అభ్యర్థులకు రూ.100ను అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ
IFS Jobs 2024 Selection Procedure :

  • ప్రిలిమినరీ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు
IFS Jobs 2024 Important Dates :

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ- 2024 మార్చి 5 (సాయంత్రం 6 గంటల వరకు)
  • దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసేందకు ఆఖరు గడువు- 2024 మార్చి 6 నుంచి మార్చి 12 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు.
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ- 2024 మే 26

అధికారిక వెబ్​సైట్​
UPSC Official Website : నోటిఫికేషన్​కు సంబంధించి మరింత సమాచారం కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ upsconline.nic.in​ను చూడవచ్చు.

అప్లై చేసుకోండిలా
How To Apply For UPSC IFS Jobs 2024 :

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ upsconline.nic.in.లోకి లాగిన్​ అవ్వండి.
  • 'Latest Updates' అనే అప్లికేషన్​ లింక్​పై క్లిక్ చేయండి.
  • వన్​ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్​) ప్రక్రియను పూర్తి చేయండి.
  • ఆ తర్వాత సంబంధిత వివరాలతో లాగిన్​ అయ్యి అప్లికేషన్​ ఫారమ్​పై క్లిక్ చేయండి.
  • అడిగిన వివరాలను బాక్స్​లో ఫిల్​ చేయండి. సంబంధిత డాక్యుమెంట్లను స్కాన్​ చేసి అప్లోడ్​ చేయండి.
  • అనంతరం నెట్​ బ్యాంకింగ్​ ద్వారా ఎగ్జామ్​ ఫీజును చెల్లించండి.
  • చివరగా సబ్మిట్​ బటన్​పై క్లిక్​తో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ముందు జాగ్రత్తగా దరఖాస్తు ఫారాన్ని ప్రింట్​ తీసుకొని భద్రపరుచుకోండి.

ఇంజినీరింగ్ అర్హతతో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

పంజాబ్​ నేషనల్ బ్యాంక్​లో 1025 'SO' పోస్టులు - దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.