ETV Bharat / education-and-career

స్టేజ్‌ పైన ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారా? - ఈ టిప్స్‌ పాటిస్తే గుడ్ స్పీకర్​ అయిపోతారు! - How Speak In Public Without Fear

How Speak In Public Without Fear : నలుగురిలో మాట్లాడాలంటే.. గొంతు తడబడుతుంది. ఇక స్టేజ్ ఎక్కాల్సి వస్తే కాళ్లు వణుకుతాయి. మనసులో భయం మొదలే.. ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మీరూ ఈ కేటగిరీలోకి వస్తారా? అయితే.. ఈ టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి.. అవి ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 10:36 AM IST

How Speak In Public Without Fear
How Speak In Public Without Fear

How Speak In Public Without Fear : మాట్లాడటం అనేది అద్భుతమైన కళ. మన ఆలోచనలు, అభిప్రాయాలను ఎదుటి వ్యక్తులకు స్పష్టంగా చెప్పగలిగే సాధనం మాట. మన మాట తీరుతో.. ఈ ప్రపంచాన్ని ఆకట్టుకోవచ్చు. జనాన్ని మన వెంట నడిపించుకోవచ్చు. ప్రేమనే కాదు.. యుద్ధాలనూ గెలవొచ్చు. అంత శక్తివంతమైనది మాట. ఇలాంటి మాట.. నలుగురిలో మాట్లాడాల్సి వస్తే చాలా మంది గొంతు మూగబోతుంది! స్టేజ్‌ ఎక్కాల్సి వస్తే కాళ్లు వణికిపోతాయి. ఈ పరిస్థితికి కారణం "భయం" అంటున్నారు నిపుణులు. మరి.. దీన్ని ఎలా తొలగించుకోవాలి? ఎలాంటి బెరుకు లేకుండా ఎలా మాట్లాడాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సబ్జెక్టు ప్రధానం :

నలుగురిలో మాట్లాడాలంటే చాలా మంది వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం సబ్జెక్టు తెలియకపోవడం. అంటే.. ఏ విషయం మీద మాట్లాడాలో.. దాని గురించి అవగాహన లేనప్పుడు స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో స్టేజ్ ఎక్కి మాటల కోసం వెతుక్కుంటే.. నీళ్లు నమిలితే.. చూస్తున్నవారంతా నవ్వుతారని, హేళన చేస్తారని భయం కలుగుతుంది. అందుకే.. మాట్లాడేందుకు చాలా మంది ముందుకు రారు. కాబట్టి.. మీరు ఏదైనా మీటింగ్​లో మాట్లాడాల్సి వస్తే.. ముందు రోజే ఆ సబ్జెక్టు గురించి తెలుసుకోండి. ఏం మాట్లాడాలో కూడా ప్రిపేర్ అవ్వండి. అవసరమైతే.. చిన్న పేపర్ ముక్కమీద.. మాట్లాడాల్సిన అంశాలను నాలుగైదు పాయింట్లుగా రాసి పెట్టుకోండి. ఇలా సబ్జెక్టు సిద్ధం చేసుకుంటే.. ఏం మాట్లాడాలో మీకు తెలుస్తుంది. దాంతో.. మీ మనసు భయపడదు. ఇక ఎలా మాట్లాడాలో చూద్దాం.

హెచ్చుతగ్గులను సరిచూసుకోవాలి :
ఎంత కాదనుకున్నా.. స్పీచ్​లు అలవాటు లేనివాళ్లకు కాస్త భయంగానే ఉంటుంది. దాన్ని పూర్తిగా తీసేయాలంటే.. మనం స్టేజ్‌పైకి వెళ్లేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్‌ కీలకం. వంగి నడవడం.. తడబడినట్టు నడవడం చేయకూడదు. రోజూ లాగానే సాధారణంగా నడవాలి. సబ్జెక్ట్ మనకు తెలుసు కదా.. నో టెన్షన్ అని చెప్పుకోవాలి. ఇక, స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు.. మనం చెప్పే అంశాన్ని మెల్లగా ప్రారంభించాలి. సాధారణ విషయాలను మామూలు గొంతులోనే చెబుతూ.. నొక్కి చెప్పాలనుకున్న ముఖ్యంశాలను కాస్త గొంతు పెంచి చెప్పాలి. మళ్లీ సాధారణ విషయాల్లోకి వెళ్తున్నప్పుడు వాయిస్ తగ్గించాలి. ఇలా కంటిన్యూ చేసి.. చివరలో కాస్త తక్కువ స్వరంతో ధన్యవాదాలు తెలిపి ముగించాలి. ఇంతే.. ఇవి రెండు విషయాలే ప్రధానం. వీటితోపాటు అడిషనల్ పాయింట్స్ కొన్ని చూసుకుంటే.. మీ స్పీచ్​ ఎఫెక్ట్ ఇంకా పెరుగుతుంది. అవేంటంటే..

మీ వాళ్లతో డిస్కస్ చేయండి:
మనం ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. చదువు కావొచ్చు, సినిమా కావొచ్చు, ఆటలు కావొచ్చు, ఆఫీసు గురించి కావొచ్చు.. దాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యలతో డిస్క్ చేయండి. దీనివల్ల.. ఎదుటి వారి నుంచి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్లకు తెలిసింది వాళ్లు చెబుతారు. దీనివల్ల.. మీకు ఆ సబ్జెక్ట్‌పై పట్టు పెరుగుతుంది.

స్పీచ్​లు వినండి..

రాజకీయ నాయకులు కావొచ్చు, ఇతరులు కావొచ్చు.. స్టేజ్​ మీద వాళ్లు ఎలా ప్రసంగిస్తున్నారు? హావభావాలు ఎలా పలికిస్తున్నారు? చేతులు ఎలా కదుపుతున్నారు? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఈ విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఇందుకోసం.. సోషల్ మీడియాలో వారి ప్రసంగాలు చూడండి. చాలా నేర్చుకోవచ్చు.

కింద ఉన్నవారిని వదిలేయండి..

మీరు స్టేజ్ మీదకు వెళ్లడానికి ఎందుకు భయపడతారంటే.. కింద వాళ్లు ఎలాంటి కామెంట్ చేస్తారోనని! ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి.. వాళ్లు భయంతోనే అక్కడ ఉండిపోయారు. ఎప్పటికీ అక్కడే.. కిందనే ఉండిపోతారు. మీరు మాత్రం స్టేజ్ ఎక్కుతారు. ఇంకా పైపైకి వెళ్తారు. కాబట్టి.. వాళ్లను వదిలేయండి.

మరికొన్ని టిప్స్ :

  • ప్రసంగిస్తున్నప్పుడు స్టేజ్‌పైన నిటారుగా నిల్చోండి. ప్రేక్షకులను చూస్తూ మాట్లాడాలి. ఒకవైపే కాకుండా.. రెండు వైపులా ఉన్నవారిని చూస్తూ మాట్లాడాలి. దీనివల్ల వారు మనతో కనెక్ట్ అవుతారు. చెప్పేది ఆసక్తిగా వింటారు.
  • వేదికపైన మన ప్రవర్తన సహజంగా ఉండాలి. రోజూ ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడటానికి ప్రయత్నించాలి. లేనిపోని బిల్డప్ ప్రదర్శించకూడదు.
  • స్టేజ్‌పైకి ఎక్కే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లను తాగండి.
  • వేదికపైకి వెళ్తున్నప్పుడు మీరు చిన్న పేపర్​ మీద ప్రిపేర్‌ చేసుకున్న నోట్స్‌ వెంట తీసుకెళ్లండి.
  • ఈ టిప్స్‌ పాటించి చూడండి.. మీరు అద్భుతమైన స్పీకర్​గా తయారవ్వడం గ్యారెంటీ.

మాక్ ఇంటర్వ్యూలకు ఎటెండ్​ కావాలా? ఈ టాప్​-4 ఫ్రీ వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

ఫ్రీలాన్సర్​గా పని చేయాలా? ఈ టాప్​-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

పార్ట్ టైమ్ జాబ్​ చేయాలా? ఈ టాప్​-10 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.