ETV Bharat / education-and-career

HCLలో ఉద్యోగాలు- ఆ కోర్స్​లు చేసిన వారే అర్హులు- లాస్ట్ డేట్​ ఎప్పుడంటే? - HCL Recruitment 2024

HCL Job Vacancies 2024 : హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రాత పరీక్ష ఉంటుందా? విద్యార్హతలేంటి? వంటి పలు వివరాలు మీకోసం.

HCL Job Vacancies  2024
HCL Job Vacancies 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 3:40 PM IST

HCL Job Vacancies 2024 : హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవం, ఖాళీల వివరాలు తెలుసుకుందాం.

  1. మైనింగ్‌-46: మైనింగ్‌ డిప్లొమా పూర్తిచేసి సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఫోర్‌మెన్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి లేదా మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి. ఫోర్‌మెన్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ లేదా సెకండ్‌క్లాస్‌ మేనేజర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.
  2. ఎలక్ట్రికల్‌-6: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి లేదా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.
  3. కంపెనీ సెక్రటరీ-2: గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా/యూకే తుది పరీక్ష పాసవ్వాలి.
  4. ఫైనాన్స్‌-1: డిగ్రీ పాసై సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇంటర్మీడియట్‌ - ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్‌ పాసై సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. లేదా పీజీ డిగ్రీ (ఫైనాన్స్‌)/ పీజీ డిప్లొమా (ఫైనాన్స్‌)/ ఎంబీఏ (ఫైనాన్స్‌) పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.
  5. హెచ్‌ఆర్‌-1: డిగ్రీ పాసై సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి లేదా పీజీ డిగ్రీ (హెచ్‌ఆర్‌)/ పీజీ డిప్లొమా (హెచ్‌ఆర్‌)/ ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేసి రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.500. మిగతావారికి ఫీజు లేదు.
  • 01.06.2024 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
  • గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఎక్స్‌- సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మినహాయింపు ఉంటుంది.
  • కాల్‌ లెటర్‌తో రాత పరీక్ష వివరాలను తెలియజేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో పొందిన మార్కుల ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థుల షార్ట్‌ లిస్టును తయారుచేస్తారు.
  • సీబీటీలో జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు 30 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీలు 20 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
  • రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలనలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
  • అన్ని పోస్టులకు కూడా ఒకే రోజున రాత పరీక్షను నిర్వహిస్తారు. కాబట్టి ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • ట్రైనింగ్‌/ కన్సల్టెన్సీ ఎక్స్‌పీరియన్స్‌/ టీచింగ్‌/ ఫెలోషిప్‌/ ఇంటర్న్‌షిప్‌/ అంప్రెటిస్‌షిప్‌/ అకడమిక్‌ ప్రాజెక్ట్‌ పనులను అనుభవంగా పరిగణించరు.
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీ, సమయం, వేదికల వివరాలను అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. కాల్‌ లెటర్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీ, ఎక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌లను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లపాటు పనిచేయాలి.
  • మొత్తం 56 ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 26, ఈడబ్ల్యూఎస్‌లకు 5, ఓబీసీలకు 15, ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 కేటాయించారు.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 21.07.2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.