CBSE Results 2024 : దేశ వ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్ ఫలితాలు రిలీజ్ కావడంతో సీబీఎస్ఈ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సమాయత్తమవుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్ని సంవత్సరాలుగా మెరిట్ జాబితాలను వెల్లడించని విషయం తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు జరిగాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాయి. దాదాపు 39లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో పదో తరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక సీబీఎస్ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలంటే.. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.
ఆ రోజునే ఫలితాలు: ఫలితాల విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్ సీబీఎస్ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్స్‌ని పరిశీలిస్తే.. గత సంవత్సరం (2023) మే 12న ఈ ఫలితాలు విడుదల చేసింది. ఆ లెక్క ప్రకారం ఈసారి కూడా దాదాపు అదే సమయానికి CBSE 10th, 12th Results విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
సీబీఎస్ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..:
- రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత విద్యార్థులు CBSE అధికారిక వెబ్సైట్ cbse.gov.in కి లాగిన్ అవ్వాలి.
- తర్వాత స్క్రీన్ మీద కనిపించే Results ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ రోల్ నంబర్, స్కూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి అవసరాల కోసం దానిని డౌన్లోడ్ చేసుకోవాలి.
ICSE Results: ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు (ICSE Results) కూడా మే రెండో వారం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. గతేడాది మే 13న ఈ ఫలితాలను సీఐఎస్‌సీఈ విడుదల చేసింది. ICSC పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 28వరకు జరగ్గా.. ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2వరకు నిర్వహించారు.
న్యూ జాబ్ ట్రెండ్ - ' ప్రమోషన్ ఇస్తారు - కష్టపడి పని చేయ్ - ఫలితం ఆశించకు!' - Dry Promotion