Best Personality Development Books : పుస్తకాలు మనుషులకు మంచి స్నేహితులుగా మాత్రమే కాదు, ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని మీరు గెలవడానికి కూడా చాలా సహాయపడతాయి. మనుషులు చెప్పలేని, నేర్పించలేని ఎన్నో విషయాలను మనం పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు గెలిస్తే ప్రపంచాన్ని సులువుగా గెలుస్తారు. అలా మిమ్మల్ని మీరు గెలవడానికి, మానసికంగా మీకున్న సందేహాలెన్నింటినో తీర్చడానికి మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ను మెరుగుపరచడానికి మీకు ఉపయోగపడే పుస్తకాలు కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్'
How to Win Friends and Influence People : మీ వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగుపరిచేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగపడే పుస్తకాల్లో డేల్ కార్నెగీ(Dale Carnegie) రచించిన 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్' క్లాసికల్ బెస్ట్ అని చెప్పచ్చు. మన చుట్టు పక్కల ఉన్నవారిని అర్థం చేసుకుని మచ్చిక చేసుకోవడం ఎలా? ఇతరుల నుంచి మెప్పు పొందడం ఎలా అనే విషయాలను ఈ పుస్తకం నేర్పుతుంది.
2. 'ది పవర్ ఆఫ్ హాబిట్స్'
The Power of Habit : మీ రోజూవారీ అలవాట్లు మీ వ్యక్తిత్వానికి నిదర్శనాలు. చెడుకు దూరంగా ఉండాలంటే మంచి అలవాట్లు ఉండాలి. మీలో మంచి అలవాట్లను పెంపొందించడానికి, చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండడం ఎలాగో తెలుసుకోవడానికి చార్లెస్ డుహిగ్( Charles Duhigg) రచించిన 'ది పవర్ ఆఫ్ హాబిట్స్' అనే పుస్తకం మీకు సహాయపడుతుంది. ఈ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీ జీవనశైలిలో మార్పులను మీరే గమనించవచ్చు.
3. 'ది పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్'
The Power of Your Subconscious Mind : ఒక వ్యక్తి ప్రవర్తనను తన సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా ప్రభావితం చేస్తుందో వివరించేదే 'ది పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్'. జోసెఫ్ మర్ఫీ(Joseph Murphy) రచించిన ఈ పుస్తకం సానుకూల ఆలోచనను పెంపొందించడానికి, ఇతరుల్లో మంచి విషయాలను చూడటానికి సహాయపడుతుంది. మీపై మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, విలువలను పెంచడానికి ఈ పుసక్తం బాగా సహాయపడుతుంది.
4. 'ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్'
The 7 Habits of Highly Effective People : స్టీఫెన్ కోవే( Stephen Covey) రచించిన ఈ పుస్తకం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగ్గా మార్చగలుగుతుంది. చురుగ్గా ఉండే అలవాట్లను పెంపొందించుకోవడం, సరైన పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ప్రధాన విషయాలను ఇది చదివి తెలుసుకోవచ్చు. మనం ఎక్కడ పని చేయాలి, మన ఇష్టాలు ఎలా ఉంటాయని ఈ పుస్తకం మనకు చెబుతుంది.
5. 'మెడిటేషన్స్'
Meditations : కొన్ని సందర్భాల్లో మీరు ప్రవర్తించిన తీరు, మీ పర్సనాలిటీపై చాలా ప్రభావం చూపుతుంది. కొందరు వాటి నుంచి తప్పించుకున్నప్పటికీ మరికొందరు వాటి కారణంగా ఒత్తిడికి గురవుతారు. అలాంటి సమయంలో కలిగే సవాళ్లను ఎదుర్కోవడానికి, మెరుగ్గా ప్రవర్తించడానికి మార్కస్ ఆరేలియస్(Marcus Aurelius) రచించిన 'మెడిటేషన్స్' పుస్తకం మీ మంచి సలహాలు ఇస్తుంది.