Zomato Large Order Fleet : ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త సర్వీస్‌లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా మంగళవారం 'లార్జ్ ఆర్డర్ ఫ్లీట్' సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఓకేసారి 50 మంది వ్యక్తులకు సరిపడా భోజనాలను డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. గ్రూప్ ఈవెంట్లు, పార్టీలు చేసుకునేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.
"భారతదేశంలోనే మొదటిసారిగా భారీ ఫుడ్ ఆర్డర్లను అందించడానికి "లార్జ్ ఆర్డర్ ఫ్లీట్"ను ప్రారంభిస్తున్నాం. ఈ ఆర్డర్లను డెలివరీ చేయడానికి 'ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లీట్'ను ఉపయోగిస్తాం. దీని వల్ల కస్టమర్లకు మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది." -
జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ట్వీట్ (ఎక్స్)
ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో డెలివరీ
Zomato All Electric Fleet : జొమాటో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేయడానికి ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతోంది. ఇంతకు ముందు సాధారణ ఆర్డర్లు ఇవ్వడానికి కూడా వీటినే వాడారు. తాజాగా వీటిని ఈ పెద్ద ఫుడ్ ఆర్డర్లు బట్వాడా చేయడానికి కూడా ఉపయోగించాలని నిర్ణయించారు. దీనిలో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్‌లు రెండూ ఉంటాయి. కనుక ఫుడ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని జొమాటో తెలిపింది.
జొమాటో ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’
Zomato Pure Veg Fleet : జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ జోషి ఇటీవలే శాకాహారుల కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ ఫ్లీట్' పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని వల్ల కస్టమర్లు శాకాహారం మాత్రమే అందించే రెస్టారెంట్‌లను ఎంపిక చేసుకునే సౌకర్యం కలుగుతుంది. అంతేకాదు నాన్-వెజ్ వండే హోటల్స్‌ను పూర్తిగా మినహాయించే అవకాశం కూడా యూజర్లకు కల్పిస్తారు. అయితే ఇందుకోసం మొదటిగా ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను ఉపయోగించాలని జొమాటో భావించింది. కానీ చివరికి ఎర్ర బాక్స్‌ల్లోనే ఫుడ్ ఆర్డర్స్ అందించాలని నిర్ణయించుకుంది.
భవిష్యత్‌లో కేక్ డెలివరీ కోసం కూడా ప్రత్యేక ఫ్లీట్‌ను ఏర్పాటుచేయనున్నామని, డెలివరీ సమయంలో కేక్ ఏమాత్రం పాడవకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంటుందని జొమాటో సీఈఓ చెప్పారు.
ఓలా బంపర్ ఆఫర్ - ఈవీల ధరలు భారీగా తగ్గింపు - ఇకపై రూ.69,999కే S1X స్కూటర్! - Ola EV Scooter Offers