Zerodha Technical Glitch : ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లేందకు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
సోమవారం ఉదయం జెరోదా యాప్‌లో ప్లేస్ చేసిన ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాలేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్డర్ క్యాన్సిల్ చేసి, డబ్బు తిరిగి తీసుకోవడానికీ వీలు కాలేదని పేర్కొన్నారు. ఆర్డర్ ప్రాసెసింగ్‌లో ఉండటం వల్ల నగదును ఉపసంహరించుకోలేరని యాప్ చూపిస్తున్నట్లు యూజర్లు తెలిపారు. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో '#Zerodha' ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
#zerodha stuck. My orders not getting executed. Will take you to court if I lose any single penny pic.twitter.com/oSy17lg32H
— Rashshad Rasheed (@rashshadrasheed) July 8, 2024
#zerodha who will bear my huge losses i put 17lakhs at 9.15 am wtf? @zerodhaonline pic.twitter.com/hUE7iGTyd2
— Tushar Dehra (@moneyzonetrader) July 8, 2024
జెరోదా క్షమాపణలు
యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు జెరోదా సైతం ధ్రువీకరించింది. కొంత మంది యూజర్లు ఆర్డర్ స్టేటస్ గురించి కొంచెం సేపు తెలుసుకోలేకపోయారని పేర్కొంది. అయితే ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించామని జెరోదా తెలిపింది. ప్రస్తుతం అంతా సజావుగానే ఉందని, సమస్య తలెత్తిన ఆర్డర్ల స్టేటస్‌లను అప్డేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సమస్యపై యూజర్లకు జెరోదా క్షమాపణలు చెప్పింది.
Some of our users were facing issues seeing the latest status of some orders while the orders themselves were successfully placed. This issue is now fixed.
— Zerodha (@zerodhaonline) July 8, 2024
The status for new orders is updating fine now. We're working on updating the status for older orders. Apologies for the…
ఇది ఆరోసారి
గత తొమ్మిది నెలల్లో జెరోదాలో ఇలా 5 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జెరోదా యూజర్లు జూన్‌లో రెండు సార్లు సమస్యను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు అయితే, అసలు యాప్ పనిచేయకుండా పోయింది. జూన్ 3న మార్కెట్లు రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఆ రోజు కూడా జెరోదాలో సమస్య తలెత్తింది. దీంతో యాప్ పనితీరుపై యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
మీ డీమ్యాట్ అకౌంట్ - 'డోమెంట్ అకౌంట్'గా మారిందా?
Why Do Demat Accounts Become Dormant : చాలా మంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. కానీ తరువాత షేర్స్ కొనడంగానీ, అమ్మడంగానీ చేయరు. అంటే ఆ డీమ్యాట్ ఖాతా ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపరు. ఇలా ఒక డీమ్యాట్ అకౌంట్ చాలా కాలంపాటు నిష్క్రియాత్మకంగా ఉంటే, అప్పుడు దానిని 'నిద్రాణంగా' (Dormant) ఉన్న ఖాతాగా పరిగణిస్తారు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు 11 నెలలు నుంచి 3 సంవత్సరాల పాటు, నిష్క్రియంగా ఉన్న ఖాతాలను 'డోమెంట్ అకౌంట్స్'గా పరిగణిస్తాయి. మరి కొన్ని సంస్థలు 5 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటిని డోమెంట్ ఖాతాలుగా నిర్ణయిస్తాయి. మీ డీమ్యాట్ ఖాతా కూడా ఇలానే ఉందా? అయితే పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.