ETV Bharat / business

ఐటీ రీఫండ్ ఇంకా రాలేదా? ఈ ఆలస్యానికి కారణాలు ఇవే! - Income Tax Refund Delay Reasons

Income Tax Refund Delay Reasons : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో అర్హత ఉన్న చాలా మందికి ఇప్పటికే రీఫండ్​ అందింది. కానీ కొంత మందికి మాత్రం పలు కారణాలతో ఆలస్యం అవుతోంది. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Income Tax Refund
Income Tax Refund (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 11:07 AM IST

Income Tax Refund Delay Reasons : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో అర్హత ఉన్న చాలా మందికి ఇప్పటికే రీఫండ్​ అందింది. కొంత మందికి మాత్రం పలు కారణాలతో రీఫండ్​ ఆలస్యం అవుతోంది. దీనికి గల ప్రధానమైన కారణాలు ఏమిటంటే?

  • ఫారం-26 ఏఎస్​లో, ఐటీ రిటర్నుల్లో నమోదు చేసిన ఆదాయం, టీడీఎస్‌ విలువల్లో తేడాలు ఉన్నప్పుడు, ఆ రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ పరిశీలించదు. కానీ ఇలాంటి వాటిని సరిచేసుకోవాలని పన్ను చెల్లింపుదారులకు సమాచారం మాత్రం ఇస్తుంది.
  • కొన్నిసార్లు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పటికీ, దానిని ఇ-వెరిఫై చేయడం మర్చిపోవచ్చు. ఇలాంటప్పుడు కూడా, మీ ఐటీ రిటర్నులను ఆదాయపు పన్ను శాఖ పరిశీలించదు.
  • రీఫండ్​ ఆలస్యం కావడానికి మరో సాధారణ కారణం ఐటీఆర్‌లో బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా నమోదు చేయడం. వాస్తవానికి పన్ను రిటర్నులలో పేర్కొన్న బ్యాంకు ఖాతాకు నేరుగా రీఫండ్​ను జమ చేస్తారు. ఇందులో పొరపాటు అంటే ఐఎఫ్‌ఎస్‌సీ, ఖాతా సంఖ్య తప్పుగా ఉంటే రీఫండ్​ విఫలం అవుతుంది. ఇలాంటప్పుడు బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి నమోదు చేసి, తిరిగి రీఫండ్​ను జారీ చేయాల్సిందిగా కోరాలి.
  • కొన్నిసార్లు మునుపటి అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించిన పన్ను బాకీలు ఉంటే, ప్రస్తుత రీఫండ్​ మొత్తం నుంచి వాటిని జమ చేసుకునే అధికారం ఆదాయ పన్ను శాఖకు ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తాయి. ఈ సర్దుబాటు ప్రక్రియ వల్ల కూడా రీఫండ్​ ఆలస్యం కావచ్చు.
  • పన్ను చెల్లింపుదారులు కొన్నిసార్లు మినహాయింపులను అధికంగా క్లెయిమ్​ చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఆ రిటర్నులను ఆదాయపు పన్ను విభాగం తనిఖీ చేసేతుంది. కనుక రీఫండ్​ ఆలస్యం అవుతుంది.
  • ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులను జాగ్రత్తగా చదివితే, రీఫండ్​ ఎందుకు రాలేదన్న విషయం మీకు క్లియర్​గా అర్థమవుతుంది. దానికి తగ్గట్లుగా సమాధానం ఇవ్వడం, సరిదిద్దుకోవడం చేస్తే రీఫండ్​ వీలైనంత త్వరగానే అందుతుంది.

రీ ఇష్యూ ఎలా కోరాలి?
రీఫండ్‌ నిలిచిపోయిన సందర్భంలో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ స్టేటస్‌లో రీఫండ్‌ ఫెయిల్యూర్‌ అని చూపిస్తుంది. రీ-ఇష్యూ కోసం ఐటీఆర్ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. సర్వీసెస్‌ ట్యాబ్‌లోకి వెళ్లి రీఫండ్‌ రీ-ఇష్యూ ఆప్షన్‌ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో క్రియేట్‌ రీఫండ్‌ రీ-ఇష్యూ రిక్వెస్ట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఏ బ్యాంక్‌ ఖాతాలో రీఫండ్‌ పడాలని కోరుకుంటున్నారో ఆ అకౌంట్​ను ఎంచుకోవాలి. తర్వాత ఆధార్‌ ఓటీపీతో వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. అంతే సింపుల్​!

'పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ - ఫేక్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జర జాగ్రత్త' - ఐటీ శాఖ హెచ్చరిక - ITR Refund Scam

రీఫండ్ కోసం చూస్తుంటే - 'డిఫెక్టివ్ ఐటీఆర్' నోటీస్​ వచ్చిందా? సింపుల్​గా కరెక్ట్ చేసుకోండిలా! - How To Correct Defective ITR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.