world Richest Man In 2024 : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటి వరకు నంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ తన సంపదలో 31 బిలియన్ డాలర్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయారు.
బ్లూబెర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 2024లో జెఫ్ బెజోస్ 23 బిలియన్ డాలర్లు మేర లాభాలను ఆర్జించారు. దీనితో ఆయన సంపద 200 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు ఎలాన్ మస్క్ ఈ 2024లో 31 బిలియన్ డాలర్లు కోల్పోయారు. దీనితో అతని సంపద 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫలితంగా ఆయన ప్రపంచ ధనవంతుల లిస్ట్‌లో రెండో స్థానానికి దిగివచ్చారు.
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్
యూఎస్ స్టాక్ మార్కెట్లు బిలియనీర్ల తలరాతలను మారుస్తూ ఉంటాయి. ఈ 2024లో అమెజాన్ షేర్లు దాదాపు 18 శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు టెస్లా కంపెనీ షేర్లు 24 శాతం వరకు నష్టపోయాయి. దీనితో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు.
షేర్లు అమ్మేసినా!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ ఏడాది 8.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు. అయినప్పటికీ ఈ అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో 9.56 శాతం షేర్లతో ఆయనే అత్యంత పెద్ద షేర్‌హోల్డర్‌గా కొనసాగుతున్నారు.
మస్క్ పరిస్థితి ఏమిటి?
టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్‌కు దాదాపు 20 శాతం షేర్లు ఉన్నాయి. పైగా ఆయనే స్వయంగా కంపెనీని నడుపుతున్నారు. ఇందుకుగాను ఆయన 55.8 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కూడా పొందేవారు. కానీ ఈ పే ప్యాకేజీ చాలా లోపభూయిష్టంగా ఉందని యూఎస్ న్యాయస్థానం ఆక్షేపించింది. దీనితో ఎలాన్ మస్క్‌కు వచ్చే పేమెంట్ భారీగా తగ్గిపోయింది. పైగా ఇప్పుడు టెస్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కనుక ఆయన సంపద విలువ బాగా తగ్గిపోయింది.
ఎలాన్ మస్క్ ఇంకా చాలా బిజినెస్‌లు రన్ చేస్తున్నారు. ముఖ్యంగా స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్)లు ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ట్విట్టర్ కూడా పూర్వంలా లాభాల్లో కొనసాగడం లేదు.
ఎలాన్ మస్క్‌కు షాక్- రూ.10వేల కోట్లకు దావా వేసిన ట్విట్టర్ మాజీ ఉద్యోగులు