ETV Bharat / business

మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నచ్చలేదా? సింపుల్​గా రద్దు చేసుకోండిలా! - Free Look Period In Insurance - FREE LOOK PERIOD IN INSURANCE

What Is Free Look Period In Insurance : మీరు కొత్తగా ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకున్నారా? కానీ ఇప్పుడు దాని షరతులు, నిబంధనలు మీకు నచ్చడం లేదా? డోంట్​ వర్రీ. మీరు తీసుకున్న బీమా పాలసీని వెనక్కి ఇచ్చేయడానికి 30 రోజుల వరకు ఫ్రీ-లుక్​ పీరియడ్ ఉంటుంది. ఈ వ్యవధిలోగా మీరు తీసుకున్న పాలసీని వెనక్కు ఇచ్చేయవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

life Insurance Policy
Free Look Period in Insurance (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 11:40 AM IST

What Is Free Look Period In Insurance : మనలో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. తీరా తీసుకున్న తరువాత అందులోని షరతులు, నిబంధనలు నచ్చకపోతే పరిస్థితి ఏమిటి? మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అవి పెద్దగా ఉపయోగపడవని తెలిస్తే, అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసుకుందాం.

ఫ్రీ-లుక్​ పీరియడ్​
ఇన్సూరెన్స్ పాలసీని వెనక్కి ఇచ్చేయడానికి మీకు 30 రోజుల వరకు వ్యవధి ఉంటుంది. పాలసీదారులు తాము తీసుకున్న పాలసీని నిశితంగా పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్​ పరిభాషలో దీన్నే 'ఫ్రీ-లుక్‌ పీరియడ్‌' అని పిలుస్తుంటారు.

జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్న తర్వాత ఈ 30 రోజుల వ్యవధిలో పాలసీదారుడు, తాను తీసుకున్న ఇన్సూరెన్స్​ పాలసీని రద్దు చేసుకుని, కొన్ని ఖర్చులు మినహా పూర్తి ప్రీమియాన్ని తిరిగి పొందేందుకు వీలవుతుంది. పాలసీ నిబంధనలు, షరతులను సమీక్షించేందుకు ఇచ్చిన ఈ సమయంలో పాలసీదారులు ఆ పాలసీతో సంతృప్తి చెందితేనే దాన్ని కొనసాగించవచ్చు. లేకపోతే రద్దు చేసుకోవచ్చు. అందుకే ఈ సదుపాయం గురించి కొత్తగా పాలసీ తీసుకునేవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

నష్టం వాటిల్లకుండా
పాలసీ నచ్చకపోతే, దాన్ని రద్దు చేసుకునే వీలును పాలసీదారుకు కల్పించడమే ఈ ఫ్రీ-లుక్‌ వ్యవధి ప్రధాన లక్ష్యం. 30 రోజుల వ్యవధిలో రద్దు చేసుకున్నప్పుడు పాలసీదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇది కాపాడుతుంది. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వ్యవధి తోడ్పడుతుంది. పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను సలహాదారులు, బీమా సంస్థలు దాచి పెట్టే అవకాశం ఉంది. తీరా పాలసీ వచ్చాక ఆ షరతులు కనిపిస్తుంటాయి. చెప్పిన విషయాలకూ, పాలసీలో పేర్కొన్న అంశాలకు చాలా వ్యత్యాసం ఉండవచ్చు. ఇలాంటప్పుడు నిర్ణీత వ్యవధిలోగా పాలసీని వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇలాంటప్పుడు మీరు చెల్లించిన ప్రీమియాన్ని బీమా సంస్థ వాపసు ఇస్తుంది.

ఎలా రద్దు చేసుకోవాలి?
పాలసీ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు 'ఫ్రీ-లుక్‌ పీరియడ్​' ఉంటుంది. ఈ వ్యవధిలో పాలసీని రద్దు చేయాలనుకుంటే, పాలసీదారు తప్పనిసరిగా బీమా సంస్థకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. పాలసీ పత్రాలు, రద్దుకు కారణం, ప్రీమియం చెల్లించిన రశీదులు మొదలైన వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాలి. ప్రీమియం వెనక్కి ఇచ్చేందుకు బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఇవ్వాలి. అనేక బీమా సంస్థలు తమ వెబ్‌సైట్ల ద్వారా పాలసీని రద్దు చేసేందుకు అనుమతిస్తున్నాయి. రద్దు అభ్యర్థనను ధ్రువీకరించుకొని, బీమా సంస్థ సదరు పాలసీని రద్దు చేస్తుంది. పాలసీదారులు చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి చెల్లిస్తుంది.

వ్యవధి ముగిస్తే?
30 రోజుల ఫ్రీ-లుక్​ వ్యవధి ముగిసిన తరువాత కూడా పాలసీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, బీమా సంస్థ కొన్ని రుసుములను మినహాయించుకొని, మిగతా ప్రీమియాన్ని రీఫండ్​ చేస్తుంది. కొన్ని పాలసీల్లో ప్రీమియం వెంటనే చెల్లించకపోవచ్చు. నిర్ణీత వ్యవధి తర్వాత పాలసీ నిబంధనల మేరకు ప్రీమియాన్ని వెనక్కి ఇస్తారు. కాబట్టి, పాలసీ నచ్చకపోతే వీలైనంత తొందరగా నిర్ణయాన్ని తీసుకోవడమే మంచిది.

మోసపూరితంగా ఇన్సూరెన్స్ పాలసీని అంటగట్టిన సందర్భాల్లో ఈ ఫ్రీ-లుక్‌ వ్యవధి కొంత మేరకు రక్షణను అందిస్తుంది. పాలసీదారు, బీమా సంస్థ మధ్య వివాదాలనూ తగ్గిస్తుంది. పాలసీదారులు బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు, పూర్తి వివరాలు తెలుసుకోవాలి. తీసుకున్న తర్వాత పాలసీ పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే దానిని కొనసాగించాలి.

హైదరాబాద్​లో భూమి ధర అక్కడే ఎక్కువ - జూబ్లీహిల్స్, గచ్చిబౌలి కాదు - High land cost in Hyderabad

ఉద్యోగులకు 10 రకాల ఆఫీస్ అలవెన్సులు- ఆదాయపు పన్ను మినహాయింపుల బొనాంజా - Tax Planning For Salaried Employees

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.