ETV Bharat / business

రూ.కోటి ఉద్యోగం వదులుకుని 500మిలియన్ డాలర్ల బిజినెస్- ఎంతో మంది మహిళలకు ఉపాధి- ఎవరీ వినీతాసింగ్?

Vineetha Singh Business Journey : వ్యాపారమంటే మాటలు కాదు, అనేక సవాళ్లను ఎదుర్కొవాలి, వివక్షతను అధిగమించాలి. ఇలా అన్ని సవాళ్లను ఎదుర్కొని మరీ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు 'షుగర్‌ కాస్మెటిక్స్‌' సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్‌. అలానే దేశంలోని వ్యాపారవేత్తల్ని ప్రోత్సహిస్తూ వారికి పెట్టుబడులను అందించే ఓ రియల్టీ టీవీ షోకు కూడా జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. లింగ వివక్షతను ఎదుర్కొని మరీ వ్యాపారంలో ఏ విధంగా రాణించారో ఈ మహిళ దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.

Vineetha Singh Business Journey
Vineetha Singh Business Journey
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 6:50 AM IST

Updated : Mar 8, 2024, 7:47 AM IST

Vineetha Singh Business Journey : వ్యాపారమంటే మాటలు కాదు, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, లాభనష్టాల్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న వాళ్లు మాటలు, చేతల్లో చూపించే వివక్షను అధిగమించడం మరో సవాలే అని చెప్పాలి. ఇలాంటివెన్నో ఎదుర్కొని మరి తమ వ్యాపారాల్లో అందలమెక్కిన 'షుగర్‌ కాస్మెటిక్స్‌' సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్‌ కూడా ఒకరు. స్థిరపడితే అది వ్యాపార రంగంలోనే అని బలంగా నిర్ణయించుకున్నారు వినీతా సింగ్. అనుకున్నది సాధించేందుకు తనకొచ్చిన కోటి రూపాయల ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. 'ఆడవాళ్లు ప్రారంభించిన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోమని విమర్శించినా భరించారు. తన సామర్థ్యాన్ని నమ్మి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిన ఆమె ప్రయాణం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆ ప్రయాణంలో వినీతా సింగ్ ఎదుర్కొన్న ఎత్తుపల్లాల్ని తెలుసుకుందాం.

'వ్యాపారంలో మహిళలు రాణించలేరు', 'వాళ్లు ప్రారంభించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ఇక అంతే'. వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలోనూ ఇలాంటి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నారు ప్రముఖ వ్యాపారవేత్త వినీతా సింగ్‌. వ్యాపారాన్నే తన కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్న ఆమె పలు స్టార్టప్స్ ప్రారంభించి విఫలమయ్యారు. ఆపై 20 ఏళ్ల క్రితం 'షుగర్‌ కాస్మెటిక్స్‌' అనే బ్యూటీ ఉత్పత్తుల బ్రాండ్‌ని ప్రారంభించారు. ఇంకా ఆ తర్వాత నుంచి వెనుతిరిగి చూడలేదు.

కోటి రూపాయల ఉద్యోగం కాదని
1983లో గుజరాత్​లో వినీతా సింగ్ జన్మించారు. వినీతా సింగ్‌ది ఉన్నత విద్యావంతుల కుటుంబం. ఒక్కగానొక్క కూతురే అయినా క్రమశిక్షణతో పెంచారు ఆమె పేరెంట్స్‌. ఏ రంగం ఎంచుకున్నా కెరీర్‌లో అత్యుత్తమంగా నిలవమని వెన్నుతట్టేవారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగమని ధైర్యం నూరిపోసేవారు. ఈ క్రమంలోనే తాను భవిష్యత్తులో వ్యాపారవేత్తగా ఎదగాలని కోరుకున్నారు వినీత. ఐఐటీ-మద్రాస్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం-అహ్మదాబాద్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత Deutsche Bankలో కోటి రూపాయల వార్షిక వేతనం కలిగిన ఉద్యోగ అవకాశమొచ్చింది. అయితే వ్యాపారమే చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వచ్చిన ఉద్యోగాన్ని తిరస్కరించారు. పలు స్టార్టప్‌లు ప్రారంభించారు. కానీ, అన్నింట్లోనూ విఫలమయ్యారు. 2012లో తన భర్త కౌశిక్‌తో కలిసి 'షుగర్‌ కాస్మెటిక్స్‌' సంస్థను ప్రారంభించి సక్సెసయ్యారు.

మహిళ సాధికారతే వ్యాపార సూత్రంగా
మహిళల బ్రాండ్‌గా తన వ్యాపారాన్ని నెలకొల్పిన వినీత సింగ్ ఈ వేదికగా మేకప్‌, బ్యూటీ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నారు. అలాగే మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాషన్‌, బ్యూటీ, రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన సలహాలిస్తున్నారు. ప్యారబెన్‌ వంటి రసాయనాలు లేకుండా, జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు వాడకుండా, పూర్తిస్థాయి వీగనిజం ఫాలో అవుతూ బ్యూటీ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. ఈ సౌందర్యోత్పత్తులు, బ్యూటీ టూల్స్‌ సామాన్య మహిళల వార్డ్‌రోబ్‌లోనే కాదు, ఎంతోమంది సెలబ్రిటీల బ్యూటీ కిట్స్‌లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం తన ఇన్‌స్టా పేజీని 8లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇక తన బ్రాండ్‌ని నెలకు 50 మిలియన్ల మందికి పైగా మహిళలు సందర్శిస్తుంటారని చెబుతున్నారు వినీత. ఓవైపు వ్యాపారవేత్తగా రాణిస్తోన్న వినీత ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో 'షార్క్‌ ట్యాంక్‌ ఇండియా'లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు. మహిళా సాధికారతే తన వ్యాపార సూత్రంగా మార్చుకున్న వినీత ప్రస్తుతం తన సంస్థలో 2800 మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

'పెట్టుబడులు పెట్టబోమన్నారు'
తన వ్యాపార దక్షతతో దేశంలోనే అత్యుత్తమ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు వినీత. 2021లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి లింగ వివక్షను సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. 'నా ఎదుగుదలలో మా అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. అయితే వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో నేనూ లింగ వివక్షను ఎదుర్కొన్నా. ఈ క్రమంలో మహిళలు ప్రారంభించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టమని కొంతమంది మొహమ్మీదే చెప్పేవారు. మీ వ్యాపారంలో మీ భర్త చేరితేనే మీ చేతికి చెక్‌ ఇస్తామనేవారు. ఇక అంతకుముందు ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలోనూ డ్రస్సింగ్ విషయంలో పలు కామెంట్లు ఎదుర్కొన్నా. దాంతో రాత్రికి రాత్రే అమ్మకు ఫోన్‌ చేసి పెద్ద బ్యాగ్‌ నిండా వదులుగా ఉండే అబ్బాయిల టీషర్ట్స్‌ పంపించమన్నా. నా రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం వాటినే ధరించాను. ఎందుకంటే ఇంత చిన్న కారణంతో నాకు అవకాశాలు మిస్‌ కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాను.' అని వినీతా సింగ్ తెలిపారు.

అదే నా సక్సెస్‌ సీక్రెట్!
'మనం ఎదుగుతూనే తోటి మహిళలకు అవకాశాలు కల్పించాలి' అన్న నినాదంతోనే ముందుకు సాగడమే నా దృష్టిలో ఇదే అసలైన సాధికారత అని వినీత అంటారు. వాళ్ల సంస్థలో పని చేసే మహిళల్లో అన్ని వర్గాలకు చెందిన వారున్నారు అని చెప్పారు. వ్యాపారంలో సానుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉంటాయి. వీటిని సమానంగా స్వీకరిస్తేనే సక్సెస్‌ సాధించగలము అని తెలిపారు. ఓ ఆంత్రప్రెన్యూర్‌గా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న వినీత, ఇద్దరు పిల్లల తల్లిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యక్తిగతంగా రన్నింగ్ అంటే చాలా ఇష్టపడతారు. ఎంతలా అంటే తన రెండో ప్రెగ్నెన్సీ సమయంలో ఆరు నెలల గర్భంతో 21 కిలోమీటర్లు పరిగెత్తి ఆదర్శంగా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ సంస్థ విలువ 500 మిలియన్‌ డాలర్లు, కాగా వినీత ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైమాటే!

Last Updated : Mar 8, 2024, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.