Upcoming Compact SUV Cars 2024 : భారత్‌లో కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు తమ లేటెస్ట్ కార్లను ఇండియా మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిలో మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా, స్కోడా, ఎంజీ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి. ఇవి ఈ 2024లో తమ లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్లను లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరి మోడల్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా?
- Mahindra XUV300 Facelift : ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఈ ఏడాది రెండో లేదా మూడో త్రైమాసికంలో ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్ & ఎక్స్‌యూవీ 300 ఈవీ కార్లను లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. అంతేకాదు దీనిలో న్యూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌ను కూడా పొందుపరిచింది. ఈ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్లోనూ పలుమార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Mahindra XUV300 EV : మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ కారు విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ 400 కారులో ఉన్న బ్యాటరీనే, ఈ అప్‌కమింగ్ ఈవీలోనూ పొందుపరిచినట్లు సమాచారం.
- Toyota Taisor : మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీబ్యాడ్జ్డ్ వెర్షనే ఈ టయోటా టైసర్. త్వరలోనే దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ టయోటా టైసర్ కారులోని పవర్ట్రైన్, ట్రాన్స్మిషన్ లైనప్‌లను ఫ్రాంక్స్ కారు నుంచే తీసుకున్నారు. అయితే ఈ టైసర్ ఎస్యూవీ కారులో పలు మైనర్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మార్పులు చేసినట్లు సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Skoda Compact SUV : స్కోడా ఇండియా 2.5 ప్రాజెక్ట్ కింద ఈ సంవత్సరం చివరిలోపు స్కోడా కాంపాక్ట్ ఎస్యూవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. కుషాక్, టైగున్ కార్లలో ఉపయోగించిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్నే ఈ స్కోడా కంపాక్ట్ ఎస్‌యూవీలోనూ పొందుపరిచారు. పైగా ఇది MT, AT ఆప్షన్స్‌లో లభిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Next-Gen Hyundai Venue : సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ బహుశా 2025వ సంవత్సరం ఫస్ట్ఆఫ్లో వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కారులో పలు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజిన్నే కొనసాగించవచ్చు. కానీ ఎక్విప్మెంట్స్ మాత్రం అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Maruti Suzuki Fronx Facelift : ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారును బహుశా 2025లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. స్థానికంగా అభివృద్ధి చేసిన HEV సిస్టమ్‌ను ఈ కారులో అమరుస్తున్నారు. ఇలా అమర్చిన తొలి బండి ఇదే కావడం విశేషం. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజిన్‌ను అమరుస్తున్నారు. ఇది లీటర్‌కు 35 కి.మీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- Kia Clavis (AY) : ఈ కియా క్లావిస్ కారును బహుశా ఈ ఏడాది చివరల్లో విడుదల చేసే అవకాశం ఉంది. సేల్ మాత్రం 2025లో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారు కియా సోనెట్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. రగ్గడ్ లుక్స్‌తో, స్పేసియస్ ఇంటీరియర్‌తో ఇది వస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కారు ఎలక్ట్రిక్, పెట్రోల్, హైబ్రిడ్ వేరియంట్లలో వస్తుందని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- MG Comet Based Compact SUV : ఎంజీ కామెట్ ఆధారంగా రూపొందించిన కాంపాక్ట్ ఎస్యూవీ కారును బహుశా 2025 మొదటి అర్థభాగంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సబ్-ఫోర్-మీటర్ కారు, ఎంజీ హెక్టర్ కంటే కాస్త చిన్నగా ఉంటుంది. మార్కెట్లో ఇది టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3లతో పోటీపడనుంది.
మోస్ట్ పవర్ఫుల్ బైక్ కొనాలా? ఈ టాప్-5 టూ-వీలర్స్‌పై ఓ లుక్కేయండి!
2024లో లాంఛ్ అయిన టాప్-9 బైక్స్ & స్కూటర్స్ ఇవే! ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే?