ETV Bharat / business

స్టన్నింగ్ ఫీచర్స్​తో - త్వరలో లాంఛ్ కానున్న టాప్​-5 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes Under 1 Lakh - UPCOMING BIKES UNDER 1 LAKH

Upcoming Bikes Under 1 Lakh : మీరు కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నారా? లేటెస్ట్ ఫీచర్స్​, స్పెక్స్​ సహా డిజైన్ అదిరిపోవాలా? అంతేకాదు ఆ బైక్​ మంచి మైలేజ్ కూడా ఇవ్వాలా? అయితే ఇది మీ కోసమే. అతి త్వరలో రూ.1 లక్ష బడ్జెట్లో భారత్​లో లాంఛ్​ కానున్న టాప్​-5 టూ-వీలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Upcoming Scooters Under 1 Lakh
Upcoming Bikes Under 1 Lakh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 2:50 PM IST

Upcoming Bikes Under 1 Lakh : బైక్స్, స్కూటీస్ అంటే యువతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మందికి ఆశ ఉన్నా, వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉండవు. అందుకే ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ బైక్స్, స్కూటీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. పైగా వీటిలో లేటెస్ట్ ఫీచర్స్, స్పెక్స్​ను పొందుపరుస్తున్నాయి. యువత ఆర్థిక పరిస్థితుల రీత్యా, మంచి మైలేజ్ ఇచ్చేలా సదరు టూ-వీలర్స్​ను తీర్చిదిద్దుతున్నాయి. ఇక 2024 సంవత్సరానికి వస్తే, పలు ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు తమ లేటెస్ట్​ బ్రాండెడ్ బైక్​లను లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిలోని టాప్​-5 బైక్స్ అండ్ స్కూటీస్​పై ఓ లుక్కేద్దాం రండి.

1. Liger X : లైగర్​ ఎక్స్ అనేది ఒక ఆటో-బ్యాలెన్స్​ ఎలక్ట్రిక్ స్కూటర్​. దీనిని ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించారు. ముంబయికి చెందిన లైగర్ మొబిలిటీ సంస్థ భారతదేశంలోనే మొదటిసారిగా ఈ సెల్ఫ్ బ్యాలెన్స్​డ్​ ఈ-స్కూటర్​ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

లైగర్ ఎక్స్​ బైక్​లో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి: X, X Plus. లైగర్​ ఎక్స్​ వేరియంట్​ రేంజ్​ 60 కి.మీ. లైగర్ ఎక్స్ ప్లస్​ బండి రేంజ్​ 100 కి.మీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. నియో-రెట్రో డిజైన్​తో వస్తున్న ఈ X, X Pluse స్కూటీలు గరిష్ఠంగా గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

ఈ లైగర్​ ఎక్స్​ స్కూటర్లు 4జీ, జీపీఎస్ ఎనేబుల్డ్​ స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. అంతేకాదు ఇది ప్రీమియం టీఎఫ్​టీ కన్సోల్​తో వస్తుంది. దీని ద్వారా కాల్స్​, మెసేజ్​ అలర్ట్​లు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ లైగర్ ఎక్స్ బహుశా 2024 నవంబర్​లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ.90 వేలు ఉండవచ్చని ఓ అంచనా.

2. TVS Fiero 125 : ఈ టీవీఎస్ కంపెనీ 2025 జనవరిలో ఫియరో 125 బైక్​ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్పోర్టీ బైక్​లో 125 సీసీ, 3 వాల్వ్​ ఎయిర్​-కూల్డ్​ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ మోటార్ ఉంటుంది. ఇది 11.38 పీఎస్ పవర్​, 11.2 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుందని తెలుస్తోంది.

టీవీఎస్ కంపెనీ ఈ ఫియరో 125 బైక్​ను హోండా ఎస్​పీ 125, హీరో గ్లామర్​ 125, బజాజ్ పల్సర్​ 125లకు పోటీగా తీసుకువస్తోంది. బహుశా దీని ధర రూ.80,000 వరకు ఉండొచ్చని ఓ అంచనా.

3. Honda Activa 7G : భారతదేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా ఒకటి. అందుకే ఈ క్రేజ్​ను, డిమాండ్​ను క్యాష్ చేసుకునేందుకు హోండా కంపెనీ 2025 మార్చిలో 'యాక్టివా 7జీ' స్కూటీని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ హోండా యాక్టివా 7జీ బైక్​లో 109.51 సీసీ, సింగిల్-సిలిండర్​ ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ ఇంజిన్​ ఉంటుంది. ఇది 7.79 పీఎస్​ పవర్​, 8.84 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే దీనిలో కొత్తగా టెలిస్కోపిక్​ ఫోర్క్​, ప్రీలోడ్​-అడ్జెస్టబుల్​ మోనోషాక్​ ఉంటాయని తెలుస్తోంది. అలాగే దీనిలోని ఫ్రంట్ వీల్​ 12 అంగుళాలు, రియర్​ వీల్​ 10 అంగుళాలు ఉంటుందని సమాచారం. ఇంకా దీనిలో సెమీ-డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​, బ్లూటూత్​ కనెక్టివిటీ, డిస్క్ బ్రేక్స్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ ఉండవచ్చని అంచనా. మార్కెట్లో దీని ధర రూ.79,000 వరకు ఉండవచ్చు.

4. Vespa Electtrica : ఈ వెస్పా ఎలక్ట్రికాపై సింగిల్ రీఛార్జ్​తో 100 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 3.6 కిలోవాట్​ సామర్థ్యం గల డీసీ మోటార్ ఉంటుంది. దీనిని కేవలం 3.5 గంటల్లోనే ఛార్జ్ చేయవచ్చు. ఇంకా ఈ స్కూటర్లో డిజిటల్ స్పీడో మీటర్​, ఓడో మీటర్​, ట్రిప్ మీటర్ ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అయితే దీని లాంఛ్ డేట్​ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీని ధర బహుశా రూ.90,000 ఉండవచ్చు.

5. Hero Xoom 125R : హీరో కంపెనీ స్పోర్టీ స్కూటర్​ సెగ్మెంట్​లో 'జూమ్​ 125ఆర్' బైక్​ను తీసుకువస్తోంది. బహుశా దీనిని ఈ ఏడాది చివర్లో లేదా 2025 ప్రారంభంలో లాంఛ్ చేసే అవకాశం ఉంది.

హీరో జూమ్​ 125ఆర్​ బైక్​ యూత్​ఫుల్​ డిజైన్​తో, 125 సీసీ ఇంజిన్​తో వస్తుంది. అప్రిలియా ఎస్​ఆర్​125, టీవీఎస్​ ఎన్​టార్క్​ 125, సుజుకి అవినిస్​, యమహా రేజెడ్​ఆర్​ 125 ఎఫ్​ఐ హైబ్రిడ్​ బైక్​లతో ఇది పోటీ పడనుంది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1 లక్ష వరకు ఉండవచ్చని అంచనా.

'రోల్ బ్యాక్ బడ్జెట్​​' నుంచి 'డ్రీమ్ బడ్జెట్​​' వరకు - మోస్ట్ ఐకానిక్​ ఇండియన్ బడ్జెట్స్ ఇవే! - Iconic Budgets Of India

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Scooter Under 1 Lakh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.