ETV Bharat / business

ఈసారి కూడా పేపర్‌లెస్‌ బడ్జెట్- ఆ యాప్‌లోనే అన్ని డాక్యుమెంట్స్‌

Union Budget App And Website : పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అందులోని సమాచారం సామాన్యులకు అందుబాటులో ఉండేలా కేంద్రం ప్రత్యేకంగా యూనియన్‌ బడ్జెట్‌ అనే వెబ్‌సైట్‌, యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా బడ్జెట్‌ ప్రతులను ఎలా చూడొచ్చు? అందులో ఏయే వివరాలు ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

Union Budget App And Website
Union Budget App And Website
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 7:47 PM IST

Union Budget App And Website : ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. గతేడాది మాదిరిగా ఈసారీ పేపర్‌లెస్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనున్నారు సీతారామన్​. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్‌ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపించనున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా అందులోని సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేందుకు యూనియన్‌ బడ్జెట్‌ అనే వెబ్‌సైట్‌తో పాటు, యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా బడ్జెట్‌ ప్రతులను ఎలా చూడొచ్చు? అందులో ఏయే వివరాలు ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత యాప్‌లో బడ్జెట్‌ పీడీఎఫ్‌ ప్రతులు విడుదల చేస్తారు. వాటితో పాటు మంత్రి పూర్తి బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ యాప్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో బడ్జెట్‌ హైలైట్స్ పేరుతో సెక్షన్‌ ఉంటుంది. ఇందులో మంత్రి బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా అందులోని ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటారు. మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రసంగానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు సైతం ఇందులో అందుబాటులో ఉంటాయి.

డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ఆర్థిక వ్యవహారాల శాఖ సూచనలతో నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (NIC) బడ్జెట్‌ యాప్‌ను డిజైన్‌ చేసింది. ఆరోగ్యసేతు, ఈకోర్ట్‌ సర్వీసెస్‌, మై గవర్నమెంట్ వంటి యాప్‌లను ఎన్‌ఐసీ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఓఎస్‌లకు అనుగుణంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు అది ఎన్‌ఐసీ రూపొందించిన యాప్‌ అవునా? కాదా? అనేది తప్పనిసరిగా సరిచూసుకోవాలి. యూనియన్ బడ్జెట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెర్చ్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది.

రైతులకు మోదీ సర్కార్​ తీపి కబురు! బడ్జెట్లో రుణాలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు!

ఎన్నికల ముందు బడ్జెట్​లో వరాల జల్లు! మోదీ సర్కార్​ ప్లాన్​ ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.