ETV Bharat / business

ఎయిర్​టెల్​ బాస్​ సునీల్ మిత్తల్‌కు బ్రిటన్‌ అత్యున్నత పురస్కారం- తొలి భారతీయుడిగా రికార్డు! - KBE Award

UK Award To Sunil Bharti Mittal : భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌తో సత్కరించింది. దీంతో ఆ దేశ ప్రస్తుత రాజు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా భారతీ నిలిచారు.

UK Award To Sunil Bharti Mittal
UK Award To Sunil Bharti Mittal
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 6:56 PM IST

Updated : Feb 28, 2024, 7:32 PM IST

UK Award To Sunil Bharti Mittal : భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌ పురస్కారానికి ఎంపిక చేసింది బ్రిటన్‌ ప్రభుత్వం. దీంతో ఆ దేశ రాజు- కింగ్ ఛార్లెస్‌ 3 చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మిత్తల్ నిలిచారు. బ్రిటన్ ప్రభుత్వం పౌరులకు అందించే అత్యున్నత పురస్కారాల్లో నైట్‌ కమాండర్ ఆఫ్‌ మోస్ట్ ఎక్స్‌లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్ అవార్డు ఒకటి. పలు రంగాల్లో విశేష సేవలందించిన విదేశీ పౌరులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవిస్తుంటారు. అంతకుముందు రతన్‌టాటా (2009), రవిశంకర్‌ (2001), జమ్‌షెడ్ ఇరానీ (1997) ఈ నైట్‌హుడ్ పురస్కారాన్ని దివంగత క్వీన్​ ఎలిజబెత్​-II చేతుల మీదుగా అందుకున్నారు.

సునీల్​ మిత్తల్​ సంతోషం​
బ్రిటన్​ రాజు చేతుల మీదుగా పురస్కారం అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు సునీల్ భారతీ మిత్తల్‌. 'బ్రిటన్ రాజు ఛార్లెస్‌ 3 నుంచి నాకు దక్కిన ఈ గుర్తింపును ఎంతో గౌరవంగా భావిస్తున్నా. యూకే, భారత్‌ మధ్య చరిత్రాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి నేను కృషి చేస్తాను. దేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన బ్రిటన్​ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు' అని 66 ఏళ్ల మిత్తల్‌ అన్నారు. కాగా, 2007లో సునీల్ మిత్తల్‌కు భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించింది.

మరిన్ని గౌరవాలు
మిత్తల్​కు బ్రిటన్​ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్​-యూకే ఫోరమ్‌లో ఈయన సీఈఓగా ఉన్నారు. గతంలో న్యూకాసిల్​ యూనివర్సిటీ నుంచి కూడా సివిల్​ లా విభాగంలో గౌరవ డాక్టరేట్​ను అందుకున్నారు భారతీ మిత్తల్​. లీడ్స్​ విశ్వవిద్యాలయం నుంచి 'హానరీ డాక్టర్​ ఆఫ్​ లాస్'​ పురస్కారాన్నీ పొందారు. భారత్​-యూకే మధ్య అంతరిక్ష రంగానికి సంబంధించి పలు కీలక విభాగాల్లో తన వంతు తోడ్పాటును అందించింది భారతీ సంస్థ.

సీనియర్​ సిటిజన్స్​ కోసం 3 సూపర్​​ స్కీమ్స్​- ఇన్వెస్ట్​ చేస్తే డబ్బే డబ్బు!

మీ కారు ఇంటీయర్​ను క్లీన్ చేసుకోవాలా? ఈ 5-సింపుల్ టిప్స్​ పాటిస్తే చాలు!

Last Updated : Feb 28, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.