ETV Bharat / business

టూర్ వెళ్తే ఈ టిప్స్ పాటించాల్సిందే - లేదంటే జేబు ఖాళీ అయిపోతుంది!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 10:56 AM IST

Travelling Tips to Save Money : మీరు టూర్ వెళ్తున్నారా? అయితే.. పర్సు నిండా డబ్బులు నింపుకున్నారా? అయినా సరే.. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. మీ పర్సు మొత్తం ఖాళీ అయిపోవడం గ్యారెంటీ! ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్​ పాటించండి!

Travelling Tips to Save Money
Travelling Tips to Save Money

Travelling Tips to Save Money : ప్రయాణాలు చేయడం అంటే చాలా మందికి ఇష్టం. నచ్చిన ప్రదేశాలు తిరగాలని.. ఎంజాయ్​ చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ.. అందుకు అవసరమైన డబ్బే ప్రధాన సమస్యగా మారుతుంది. చివరకు డబ్బు దాచుకొని మరీ.. ట్రావెల్​కు వెళ్తే అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చైపోతుంది. అంతో ఇంతో అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలే.. కొన్ని టిప్స్​ పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

బడ్జెట్​: ట్రిప్​ ప్లాన్​ చేసేముందు ఆ ట్రిప్​ కోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో ముందే ప్లాన్​ చేసుకోవాలి. ఈ ట్రిప్​ కోసం ఇంత బడ్జెట్​ అని ముందుగానే ఫిక్స్​ చేసుకుని.. దాని ప్రకారమే ఖర్చు చేసుకోవాలి. అంతేకాదు.. కేటాయించిన మొత్తం బడ్జెట్​లో 75 శాతం మనీతోనే ట్రిప్​ కంప్లీట్​ అయ్యేలా ప్లాన్​ చేసుకోవాలి. మిగిలిన డబ్బును 25 శాతాన్ని అనుకోని ఖర్చులను వాడుకునేలా చూసుకోవాలి.

మీకు సంతోషం కావాలా? - అక్కడ దొరుకుతుంది - వెళ్లి తెచ్చుకోవడమే!

ముందుగానే: ట్రిప్​కు వెళ్లాలని ఫిక్స్​ అవ్వగానే.. చాలా మంది ఎలా వెళ్లాలని ఆలోచిస్తారు. కొద్దిమంది ఓన్​ వెహికల్​ తీసుకెళ్దామని అనుకుంటే.. మరికొందరు ట్రైన్, ఫ్లైట్​లో వెళ్లాలని డిసైడ్​ అవుతారు. సొంత వాహనంలో వెళ్లేవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ ఇతర మార్గాల ద్వారా వెళ్లాలనుకునేవారు ముందుగానే టికెట్లు బుక్​ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ముందే టికెట్లు బుక్​ చేసుకుంటే డబ్బు కొద్దిమేర సేవ్​ చేసుకోవచ్చు. ఇక సొంత కారులో వెళ్లేవారు బండి కండీషన్​ ముందుగానే చెక్​చేసుకోవాలి. ఒకవేళ అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైనై రిపేర్​ వస్తే డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.

ఫుడ్​ అండ్​ స్టే: మరో ముఖ్యమైనది ఏంటంటే.. వెళ్లబోయే ప్రాంతం గురించి, అక్కడి ఫుడ్​, వసతి వివరాలు ముందుగానే తెలుసుకోవడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. స్టే చేయడానికి హోటల్ గదిని బుక్ చేయడం వల్ల ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల కోసం యూజ్​ అవుతుంది. అలాకాకుండా ఎక్కువ మందికి హోటల్​ బుక్​ చేయాలంటే డబ్బులు కూడా ఎక్కువగానే అవుతాయి. కాబట్టి.. ఎక్కువ మంది ఉండటానికి.. కుటుంబాల కోసం వెకేషన్ రెంటల్ అందుబాటులో ఉన్నాయి. వాటిని యూజ్​ చేసుకోవడం ద్వారా మనీ సేవ్​ అవుతుంది.

దూర ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇవి పాటించండి..

కార్డ్స్​: ట్రావెలింగ్​ చేసే సమయంలో కొంత డబ్బు మాత్రమే దగ్గర ఉంచుకుని.. కార్డుల ద్వారా పేమెంట్​ చేయడం బెస్ట్​. ఎందుకంటే కొన్ని కార్డులు ఆఫర్లు ప్రకటిస్తాయి. వాటి ద్వారా పేమెంట్​ చేస్తే డబ్బు సేవ్​ అవుతుంది. అలాగే కొద్దిమంది ఒక్క కార్డు మాత్రమే తీసుకెళ్తారు. అలాకాకుండా ఓ రెండు మూడు కార్డులు తీసుకెళ్తే ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంకులో ఏదైనా టెక్నికల్​ ఇష్యూ వస్తే ఇబ్బంది ఉండదు.

ఇన్సూరెన్స్​: ఇకపోతే పెద్ద ట్రిప్పులకు వెళ్తున్నప్పుడు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం వల్ల యూజ్​ అవుతుంది. ఎందుకంటే టూర్ వెళ్లిన సమయంలో అనుకోని సంఘటనులు ఏమైనా జరిగినా, లగేజీ, క్రెడిట్​ కార్డు పోగొట్టుకున్నా పరిహారం అందుతుంది.

సంపాదన ఇప్పుడే స్టార్ట్ అయిందా?.. ఈ 10 టిప్స్‌ మీ కోసమే!

ఎంత సంపాదిస్తున్నా చాలట్లేదా? ఈ టిప్స్​తో మినిమమ్ ఉంటది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.