ETV Bharat / business

హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఏజెంటును కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలివే! - Home Insurance Questions

Home Insurance Questions : ఇల్లు కట్టుకోవడం ఎంత ముఖ్యమో, పదికాలాల పాటు నిలిచేలా దాన్ని పదిలంగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందుకోసం మనం హోం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అయితే ఇలా గృహ బీమా పాలసీ తీసుకునేటప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్​ను కచ్చితంగా కొన్ని కీలకమైన ప్రశ్నలు వేయాలి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్ సెటిల్​మెంట్ జరుగుతుంది. అందుకే ఏజెంట్​ను కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Home Insurance Questions
Home Insurance (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 12:52 PM IST

Home Insurance Questions : సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. సగటు మనిషి జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయం కూడా ఇదే. చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో ఇల్లు కొంటాం లేదా కట్టుకుంటాం. అలాంటి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు హోం ఇన్సూరెన్స్ చేయించుకోవడం అత్యవసరం. దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, ఊహించని ఇతర విపత్తులు ఎదురైన సమయంలో మన ఇంటికి హోం ఇన్సూరెన్స్ భరోసాగా నిలుస్తుంది. అయితే హోం ఇన్సూరెన్స్ పాలసీని గుడ్డిగా తీసుకోవడం సరికాదు. దానికి సంబంధించి మనకు ఉండే సందేహాలను, కవరేజీతో ముడిపడిన షరతుల వివరాలను సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఏజెంట్‌ను అడిగి తెలుసుకోవాలి. ప్రత్యేకించి తొలిసారి ఇంటికి ఇన్సూరెన్స్ చేయిస్తున్న వారు దీన్ని ఫాలో కావాలి. అందుకే హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునేవారు ఏజెంట్‌ను కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను అడగాల్సిన కీలక ప్రశ్నలు

1. కవరేజ్ : హోం ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా లభించే కవరేజీ వివరాలను తెలుసుకోవాలి. ఆ పాలసీలో ఏయే రకాల ప్రమాదాలను చేర్చారు? ఏయే రకాల విపత్తులను మినహాయించారు? అనేది అడగాలి. సాధారణంగా అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి కవరేజీ లభిస్తుంటుంది. పాలసీ మీ ఇల్లు, వస్తువుల పూర్తి రీప్లేస్‌మెంట్ ఖర్చును కవర్ చేస్తుందా? నగదు విలువను మాత్రమే కవర్ చేస్తుందా? అనేది కూడా తెలుసుకోవాలి. మీరు మరమ్మతుల సమయంలో తాత్కాలికంగా ఇల్లు మారాల్సి వస్తే, ఆ వ్యవధిలో అదనపు జీవన వ్యయాలకు కవరేజీ లభిస్తుందా? అనేది అడిగి తెలుసుకోవాలి. పాలసీ కవరేజీ కోసం ఇంటి వయస్సు, ప్రదేశం వంటి వాటిని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారా? అనే ప్రశ్న ఏజెంట్‌ను అడగాలి.

2. ప్రీమియం లెక్కింపు : హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించే ప్రీమియం వివరాల గురించి ఏజెంట్‌ను అడిగి తెలుసుకోవాలి. ఆ ప్రీమియంను ఎలా లెక్కిస్తారు? అనే విషయం అడగాలి. దీనివల్ల మీ పాలసీ ధరపై ప్రభావం చూపే అంశాలు మీకు అర్థమవుతాయి. సాధారణంగా ఇంటి పరిమాణం, వయస్సు, దాని స్థానం వంటి అంశాలు పాలసీ ప్రీమియం ధరపై ప్రభావం చూపుతాయి. హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు, ఫైర్ అలారం ఏర్పాట్లు ఇంట్లో ఉన్నప్పుడు పాలసీ ప్రీమియంలో ఏమైనా డిస్కౌంట్ లేదా క్రెడిట్ లభిస్తుందా అని అడగాలి. ప్రీమియం రేట్లు తరచుగా ఎంత మేర మారుతాయి? అలా మారడానికి ఏయే అంశాలు కారణం అవుతాయి? అనేది ఏజెంట్ ద్వారా తెలుసుకోవాలి. ఇక ప్రీమియంను ఏడాదికోసారి చెల్లించాలా? నెలవారీ వాయిదాల్లోనూ చెల్లించే వెసులుబాటు ఉందా? అనే ప్రశ్నను కూడా వేయాలి.

3. క్లెయిమ్స్ హిస్టరీ : గృహ బీమా పాలసీని తీసుకునేటప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసే పద్దతి గురించి తెలుసుకోవాలి. క్లెయిమ్ చేసే ప్రక్రియ, పరిహారం సెటిల్ అయ్యే వ్యవధి గురించి ప్రశ్నలు అడగాలి. క్లెయిమ్‌లను సెటిల్ చేసే విషయంలో కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డ్‌ గురించి ఏజెంటు నుంచి సమాచారం రాబట్టాలి. గతంలో ఇలాంటి హోం ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ఎలా నిర్వహించారు? కస్టమర్ల నుంచి వచ్చిన స్పందన ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఏడాది వ్యవధిలో క్లెయిమ్‌ల సంఖ్యపై పరిమితి ఏమైనా ఉందా? క్లెయిమ్‌ల రకాలపై ఏవైనా పరిమితులు ఉన్నాయా? అనే దానిపై ఏజెంట్‌కు ప్రశ్నలు వేయాలి. క్లెయిమ్స్‌కు అప్లై చేసేటప్పుడు ఏయే డాక్యమెంట్లను సమర్పించాలి అనేది తెలుసుకోవాలి.

4. ఇప్పటికే హోం లోన్ ఉంటే ఎలా?
ఇప్పటికే మీ ఇంటిపై హోం లోన్ ఉంటే, మీకు కచ్చితంగా హోం లోన్ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ప్రశ్నలను తప్పకుండా ఏజెంట్‌ను అడగాలి. ఇంటి నిర్మాణానికి లోన్ ఇచ్చిన ఆర్థిక సంస్థ లేదా బ్యాంకు నుంచి ఏవైనా అనుమతులతో కూడిన డాక్యుమెంట్లను తెచ్చి ఇవ్వాలా? అనేది తెలుసుకోండి. హోం లోన్ ఇన్సూరెన్స్ పాలసీకి, హోం ఇన్సూరెన్స్ పాలసీకి ఉన్న తేడా గురించి ఏజెంట్‌ను అడిగి తెలుసుకోవాలి. హోం లోన్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఇప్పటికే ఎంత చెల్లిస్తున్నాం అనే సమాచారాన్ని మీరు సేకరించుకోవాలి. ఒకవేళ అదనంగా హోం ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంటే, ఏడాదికి ఎంత ప్రీమియం కట్టాల్సి వస్తుందనే దానిపై ఏజెంటు ద్వారా సమాచారం పొందాలి. ఈ రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీల కవరేజీలు ఏకకాలంలో పొందొచ్చా? లేదా? అనేది కూడా తెలుసుకోండి.

5. భారత్ గృహ రక్షా పాలసీ
ఆన్‌లైన్‌లో మనకు 'భారత్ గృహ రక్షా పాలసీ' అందుబాటులో ఉంది. అది తీసుకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు వివిధ రకాల విపత్తుల నుంచి బీమా కవరేజీ లభిస్తుంది. అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వంటి ప్రమాదాలకు అది సమగ్ర కవరేజీని అందిస్తుంది. ఈ పాలసీ కింద అందుబాటులో ఉన్న ఏవైనా ఆప్షనల్ యాడ్-ఆన్‌ల గురించి ఏజెంట్‌ను ప్రశ్నించాలి. ఈ పాలసీకి ప్రత్యేకంగా ఏవైనా మినహాయింపులు లేదా పరిమితులు ఉన్నాయా? అనేది తెలుసుకోవాలి. పాలసీ పూర్తి రీప్లేస్‌మెంట్ ఖర్చును కవర్ చేస్తుందా లేదా అసలు నగదు విలువను మాత్రమే కవర్ చేస్తుందా? అనే ప్రశ్న అడగాలి. కవరేజ్ పరంగా, ఖర్చుపరంగా 'భారత్ గృహ రక్షా పాలసీ' ఇతర ప్రామాణిక గృహ బీమా పాలసీల కంటే ఎలా భిన్నమైందో తెలుసుకోవాలి.

హోం ఇన్సూరెన్స్ ఏజెంటును అడగదగిన మరిన్ని ప్రశ్నలు ఇవే!

  • బీమా సంస్థ ఆర్థిక బలం, స్థిరత్వం ఏమిటి? అనేది అడగాలి. వీలైనంత వరకు బలమైన క్రెడిట్ రేటింగ్, ఆర్థిక స్థిరత్వ చరిత్ర కలిగిన కంపెనీని ఎంచుకోండి.
  • ఇంట్లోని విలువైన వస్తువులకు కవరేజ్ లభిస్తుందా? లేదా? తెలుసుకోండి.
  • ఏదైనా ప్రమాదం జరిగితే పునర్నిర్మించడానికి, పునరుద్ధరించడానికి మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల ప్రకారం నిధులను ఇవ్వగలదా? లేదా? తెలుసుకోండి.
  • అదే సంస్థ నుంచే వాహన లేదా జీవిత బీమా పాలసీలు కూడా తీసుకుంటే, హోం ఇన్సూరెన్స్ పాలసీలో డిస్కౌంట్లు ఇస్తారా అనేది తెలుసుకోండి.
  • అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయేలా పాలసీని మార్చుకునే వెసులుబాటు ఉందో, లేదో తెలుసుకోండి.
  • బీమా సంస్థ కస్టమర్ సర్వీస్ ఎలా అందిస్తుందో తెలుసుకోండి. క్లెయిమ్‌లను ఎంత వేగంగా ప్రాసెస్ చేస్తుందో అడగండి.
  • పాలసీలో ఇంటికి దూరంగా ఉండే గ్యారేజీ వంటి అవుట్‌బిల్డింగ్‌లను కవర్ చేస్తారా అనేది తెలుసుకోండి.
  • హోం ఇన్సూరెన్స్ పాలసీ వర్తించడానికి, ఇంట్లో పెంపుడు జంతువులను ఉంచరాదనే రకానికి చెందిన కఠిన నిబంధనలు ఏవైనా ఉన్నాయా అనేది తెలుసుకోండి.
  • ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య చెల్లింపుల కవరేజీ లభిస్తుందా, లేదా తెలుసుకోండి.
  • పాలసీని పునరుద్ధరించే ప్రక్రియ గురించి, ఆ సమయంలో ప్రీమియంలో జరిగే మార్పుల గురించి కూడా సమాచారం సేకరించండి.

ఐటీఆర్​ దాఖలు​ చేశారా? ఇదే లాస్ట్​ డేట్​ - గడువు దాటితే ఆ ప్రయోజనాలు కట్​! - ITR Filing Last Date 2024

చిన్నారుల భవితకు భరోసా 'NPS వాత్సల్య' - స్కీమ్​ బెనిఫిట్స్ ఇవే! - NPS Vatsalya Scheme Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.