Top 5 Car Launches In 2024 : మీరు మంచి ఫీచర్లు, స్పెక్స్ ఉన్న కారు కొనాలని అనుకుంటున్నారా? ఇందుకోసం రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయగలరా? అయితే చాలా మంచిది. ఈ 2024లో లాంఛ్ అయిన, లాంఛ్ కానున్న టాప్-5 కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Hyundai Creta Features : హ్యుందాయ్ కంపెనీ 2024 జనవరి 16న అప్డేటెడ్ క్రెటా కారును ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ కారులో బోలెడ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులు చేశారు. దీని క్యాబిన్ చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఈ కారులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏడీఏఎస్ ఉన్నాయి.
ఈ హ్యుందాయ్ క్రెటా కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. న్యూ క్రెటా కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 PS/ 253 Nm)ఉంది. దీనికి పెయిర్‌గా DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. ఇక రెగ్యులర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (115 PS/ 144 Nm) అనేది 6-స్పీడ్ ఎంటీ, సీవీటీ అనుసంధానంలతో పనిచేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 PS/ 250 Nm) 6-స్పీడ్ ఎంటీ అండ్ ఏటీ అనుసంధానంతో పనిచేస్తుంది.
- Hyundai Creta Mileage : ఈ హ్యుందాయ్ క్రెటా (పెట్రోల్ వేరియంట్) ఒక లీటర్‌కు 17 కి.మీ మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వేరియంట్ ఒక లీటర్‌కు 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
- Hyundai Creta Car Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ క్రెటా కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.20.15 లక్షల రేంజ్లో ఉంటుంది.
- Hyundai Creta Resale Value : ఈ హ్యుందాయ్ క్రెటాను మూడేళ్లు ఉపయోగించి, తరువాత అమ్మాలనుకుంటే, బహుశా రూ.7.2 లక్షల నుంచి రూ.13.1 లక్షల వరకు రీ-సేల్ వాల్యూ రావచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Mahindra Thar 5 Door Features : మహీంద్రా థార్ 5-డోర్లో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో రూమియర్ క్యాబిన్, ఎక్స్ట్రా డోర్స్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ ఉన్నాయి. అంతేకాదు దీనిలో డ్యూయెల్-జోన్ క్లైమేజ్ కంట్రోల్ విత్ రియర్ ఏసీ వెంట్స్, స్టార్ట్/ స్టాప్ పుష్ బటన్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ కారులో పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉంది.
ఈ మహీంద్రా థార్ కారు 2.2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రెండూ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తాయి. అలాగే ఇది ఫోర్-వీల్ డ్రైవ్, రియర్వీల్ డ్రైవ్ ఆప్షన్లను కలిగి ఉంది.
- Mahindra Thar 5 Door Mileage : ఈ మహీంద్రా థార్ టర్బో పెట్రోల్ వేరియండ్ ఒక లీటర్‌కు 13 కి.మీ మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వేరియంట్ ఒక లీటర్‌కు 17 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారును బహుశా ఈ 2024 ఆగస్టులో లాంఛ్ చేసే అవకాశం ఉంది.
- Mahindra Thar 5 Door Price : మార్కెట్లో ఈ మహీంద్రా థార్ 5 డోర్ కారు ధర సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉండవచ్చు.
- Mahindra Thar 5 Door Resale Value : ఈ మహీంద్రా థార్ కారును మూడేళ్లపాటు ఉపయోగించి, రీ-సేల్ చేస్తే రూ.9.8 లక్షల నుంచి రూ.14.3 లక్షల వరకు రావచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Volkswagen Taigun Features : ఈ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అనేది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్. ఇప్పటికే ఈ కారును మరోపేరుతో బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేశారు. అక్కడ దీని ఎక్స్టీరియర్లో చాలా మార్పులు చేశారు. కనుక ఇండియా-స్పెక్ టైగన్‌లో కూడా ఇలాంటి మార్పునే ఊహించవచ్చు. అయితే ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు చేయలేదని సమాచారం.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కారులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ ఉన్నాయి. ఈ కారులో 1 లీటర్ పెట్రోల్ (115 PS/ 178 Nm); 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (150 PS/ 250 Nm) వేరియంట్లు ఉన్నాయి. ఇవి రెండూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. దీనితోపాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
- Volkswagen Taigun Price : మార్కెట్లో ఈ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధర సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును బహుశా ఈ 2024 అక్టోబర్‌లో లాంఛ్ చేయవచ్చు.
- Volkswagen Taigun Resale Value : ఈ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కారును 3 ఏళ్లు వాడి, రీసేల్ చేస్తే సుమారుగా రూ.7.8 లక్షల నుంచి రూ.13.6 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Hyundai Alcazar Features : క్రెటా త్రీ-రో వెర్షన్ ఆధారంగా ఈ హ్యుందాయ్ అల్కాజర్ కారును రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ఈ హ్యుందాయ్ అల్కాజర్ కారు ముందు, వెనుక భాగాల్లో ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. దీనిలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏడీఏఎస్ కూడా ఉంటాయి. ఈ కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 160 PS పవర్ జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 PS పవర్ జనరేట్ చేస్తుంది. ఇవి 6-స్పీడ్ ఎంటీ, ఏటీ; 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తాయి.
- Hyundai Alcazar Mileage : మార్కెట్లో ఈ హ్యుందాయ్ అల్కాజర్ కారు లీటర్ పెట్రోల్‌కు 16 కి.మీ; లీటర్ డీజిల్‌కు 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారును బహుశా ఈ 2024 ఏప్రిల్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.
- Hyundai Alcazar Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ అల్కాజర్ కారు ధర సుమారుగా రూ.17 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉండవచ్చు.
- Hyundai Alcazar Resale Value : ఈ హ్యుందాయ్ అల్కాజర్ కారును మూడేళ్ల తరువాత సేల్ చేస్తే సుమారుగా రూ.11 లక్షల నుంచి రూ.14.3 లక్షల వరకు లభించవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Hyundai Tucson Features : ఈ ఫోర్త్-జెన్ హ్యుందాయ్ టక్సన్‌ను 2024 జూన్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఎక్స్టీరియర్లో అనేక మార్పులు చేశారు. స్లీకర్ అండ్ వైడర్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. లైటింగ్ ఎలిమెంట్స్ సహా అల్లాయ్ వీల్స్ డిజైన్ మార్చారు.
ఈ హ్యుందాయ్ టక్సన్ కారు లోపల చాలా మార్చులు చేశారు. ముఖ్యంగా స్క్రీన్ సెటప్, స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్, క్లైమేట్ కంట్రోల్ ప్యానల్లను రీడిజైన్ చేశారు. దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ ఏసీ, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ కూడా ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
ఈ హ్యుందాయ్ టక్సన్‌లో 2 లీటర్ పెట్రోల్ యూనిట్ (156 PS/ 192 Nm); 2 లీటర్ డీజిల్ ఇంజిన్ (186 PS/ 416 Nm) ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 6-స్పీడ్ ఏటీ, 8-స్పీడ్ ఏటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తాయి.
- Hyundai Tucson Mileage : ఈ హ్యుందాయ్ టక్సన్ కారు ఒక లీటర్ పెట్రోల్‌కు 12 కి.మీ; ఒక లీటర్ డీజిల్‌కు 15 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
- Hyundai Tucson Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్ టక్సన్ కారు ధర రూ.29.5 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఉండవచ్చు.
- Hyundai Tucson Resale Value : ఈ హ్యుందాయ్ టక్సన్ కారును మూడేళ్లు ఉపయోగించి, తరువాత అమ్మేస్తే సుమారుగా రూ.19.2 లక్షల నుంచి రూ.23.4 లక్షల వరకు రావచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ABS ఫీచర్‌తో బైక్ కొనాలా? ఈ టాప్-5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంఛ్ డేట్ ఫిక్స్డ్ - కియా & టయోటా కార్స్ రీకాల్ - ఎందుకంటే?