ETV Bharat / business

భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? రిస్క్​ లేని టాప్​-10 స్కీమ్స్​ ఇవే! - Top 10 Risk Free Schemes

Top 10 Risk-Free Schemes : మీరు భవిష్యత్ కోసం పొదుపు, మదుపు ప్రారంభించాలని అనుకుంటున్నారా? కానీ మీకు రిస్క్ తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదా? అయితే ఇది మీ కోసమే. ఎలాంటి నష్టభయం లేకుండా, ఫిక్స్​డ్​గా రాబడిని ఇచ్చే టాప్​-10 పెట్టుబడి మార్గాల గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

money tree
Investment (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 4:09 PM IST

Top 10 Risk-Free Schemes : మనలో చాలా మందికి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి నష్టభయంలేని, కచ్చితంగా రాబడిని ఇచ్చే ఆదాయ మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. మరి మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.

ఎవరైనా తాము కోరుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వీలైనంత త్వరగా పొదుపు, పెట్టుబడులను ప్రారంభించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందడానికి, అనుకున్న విధంగా ఆర్థిక నిధిని సమకూర్చుకోవడానికి వీలవుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు మీ సంపాదన, దైనందిన, అత్యవసర ఖర్చులు, నష్టాన్ని భరించే శక్తి మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పెట్టుబడులను కొనసాగించగలుగుతారు. అందుకే ఈ ఆర్టికల్​లో అందరికీ ఉపయోగపడే, ఎలాంటి నష్టభయంలేని, కచ్చితంగా రాబడిని ఇచ్చే 10 పథకాల గురించి తెలుసుకుందాం.

1. స్మాల్​ సేవింగ్స్ స్కీమ్​ : స్టాక్ మార్కెట్​, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్​ రంగంలో పెట్టుబడి పెట్టాలంటే భారీ స్థాయిలో మన దగ్గర డబ్బులు ఉండాలి. పైగా నష్టభయం కూడా ఎక్కువగానే ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టాలన్నా ఎక్కువ మొత్తమే అవసరం అవుతుంది. రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడనివారికి ఇవి అంతగా నప్పవు. అందుకే ఇలాంటి వారు ఫిక్స్​డ్ డిపాజిట్లు తీసుకోవడం చాలా మంచిది. ఫిక్స్​డ్ డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.2 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తారు. పైగా వీటి వల్ల ఇన్​కం ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీ ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు.

2. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్​ స్కీమ్​ : కేవలం రూ.500తో పోస్ట్​ ఆఫీస్​ సేవింగ్స్​ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్ఠంగా ఎంత మొత్తమైనా దీనిలో పొదుపు చేయవచ్చు.

3. సీనియర్ సిటిజన్​ సేవింగ్స్ స్కీమ్​ : వయోవృద్ధుల కోసం తీసుకువచ్చిన ప్రత్యేక పథకం ఇది. ఈ సీనియర్​ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్​లో కనిష్ఠంగా రూ.1000, గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పొదుపు చేయవచ్చు.

4. సుకన్య సమృద్ధి యోజన : ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకం ఇది. ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ వీలును బట్టి నెలవారీగా డబ్బులు కట్టవచ్చు. లేదా ఏడాదికి ఒకసారి ఏకమొత్తంగానూ డబ్బులు చెల్లించవచ్చు.

5. రికరింగ్ డిపాజిట్ స్కీమ్​ (5 సంవత్సరాలు) : ఇందులో ఎవరైనా డిపాజిట్ చేయవచ్చు. నెలకు కనీసం రూ.100 చొప్పున చెల్లిస్తూ ఈ అకౌంట్​ను మెయింటైన్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. కనుక మీకు వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు.

6. మంత్లీ ఇన్​కమ్ అకౌంట్​ : ఒక వ్యక్తి ఈ ఖాతాలో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్​ అయితే గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు మదుపు చేసుకునే వీలుంటుంది.

7. పబ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్​ : ఉద్యోగులకు ఒక వరం లాంటిది పీపీఎఫ్ అకౌంట్​. రూ.500 కనిష్ఠ మొత్తంతో పీపీఎఫ్ అకౌంట్​ను ఓపెన్ చేయవచ్చు. ఒక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఈ పీపీఎఫ్ ఖాతాలో మదుపు చేయవచ్చు. మీరు కావాలనుకుంటే నెలవారీగా, లేదా ఏక మొత్తంలోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు.

8. కిసాన్ వికాస్ పత్ర : రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకం ఇది. కేవలం రూ.1000తో ఈ పథకంలో చేరవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు.

9. మహిళా సమ్మాన్​ సేవింగ్​ సర్టిఫికెట్​ : మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకం ఇది. దీనిలో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

10. టైమ్ డిపాజిట్స్​ (1, 2, 3, 5 సంవత్సరాలు) : పోస్ట్​ ఆఫీసుల్లో టైమ్ డిపాజిట్లు చేయవచ్చు. 1, 2, 3, 5 సంవత్సరాల లాకిన్ పీరియడ్​తో ఈ ఖాతాలు ఓపెన్ చేయవచ్చు. ఇందులో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవన్నీ ఎలాంటి నష్టభయం లేకుండా, ఫిక్స్​డ్​ రాబడిని ఇచ్చే పథకాలు. కనుక వీటిలో మీకు నచ్చిన పథకాన్ని ఎంచుకుని పొదుపు, మదుపును ప్రారంభించవచ్చు. ఈ ఆర్టికల్​లో తెలిపిన విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కనుక ఇన్వెస్ట్​మెంట్లు ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

మీ క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా? ఇలా చేస్తే​ ఈజీగా పెరుగుతుంది! - How To Increase Credit Card limit

సెకండ్ హ్యాండ్ కారు కోసం లోన్​ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి సుమా! - Second Hand Car Loan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.