Top 10 Cheapest Cars In India : ఇండియాలోని చాలా మంది మధ్యతరగతి ప్రజలకు కొత్త కారు కొనాలనేది ఒక కల. అందుకే ఇలాంటి వాళ్ల కోసం ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ ధరకే మంచి కార్లను అందిస్తున్నాయి. వాటిలో రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల బడ్జెట్లోని టాప్-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Maruti Suzuki Alto 800 : ఈ మారుతి ఆల్టో 800 ప్రారంభ ధర రూ.3.54 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు 22.05 kmpl మైలేజ్ ఇస్తుంది. దీనిలోని 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 47.3 bhp పవర్, సీఎన్‍జీ పవర్ట్రైన్ 40 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు (పెట్రోల్ వేరియండ్), 60 లీటర్లు (సీఎన్‍జీ వేరియంట్) ఉంటుంది.
2. Maruti Alto K10 : ఈ మారుతి ఆల్టో కె10 ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరం) ఉంటుంది. దీనిలోని పెట్రోల్ ఇంజిన్ 66 bhp పవర్, సీఎన్‍జీ వేరియంట్ 55 bhp పవర్ జనరేట్ చేస్తాయి. ఈ కారు మైలేజ్ 24.39 kmpl -24.90 kmpl ఉంటుంది. ఫ్యూయెల్ కెపాసిటీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ 27లీటర్, సీఎన్‍జీ వేరియంట్ 55 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటాయి.
3. Maruti S-Presso : ఈ మారుతి ఎస్-ప్రెస్సో ధర సుమారుగా రూ.4.26 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు 65 bhp (1.0L పెట్రోల్ మోడ్), 55 bhp (సీఎన్‍జీ మోడ్) పవర్‌ను డెలివరీ చేస్తుంది. ఈ కారు 24.76 kmpl -25.30 kmpl మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్ 27 లీటర్లు, సీఎన్‍జీ వేరియంట్ 55 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటాయి.
4. Renault Kwid : ఈ రెనో క్విడ్ కారు ధర సుమారుగా రూ.4.69 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు 67 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 21.70 kmpl -22 kmpl ఉంటుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 28 లీటర్లు.
5. Maruti Celerio : ఈ మారుతి సెలెరియో కారు ధర సుమారుగా రూ.5.37 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ 65 bhp పవర్, సీఎన్‍జీ వేరియంట్ 55 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ కారు 26 kmpl -26.68 kmpl మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్లు, సీఎన్‍జీ వేరియంట్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు ఉంటుంది.
6. Maruti WagonR : మార్కెట్లో ఈ మారుతి వ్యాగన్-ఆర్ ప్రారంభ ధర సుమారుగా రూ.5.54 లక్షలు ఉంటుంది. ఈ కారు 1.0L పెట్రోల్ వేరియంట్ 65 bhp పవర్; 1.2L పెట్రోల్ వేరియంట్ 88.5 bhp పవర్, సీఎన్‍జీ ఇంజిన్ 55 bhp పవర్‌ను జనరేట్ చేస్తాయి. పెట్రోల్ కారులో 37 లీటర్స్, సీఎన్‍జీ కారులో 55 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ మారుతి వ్యాగన్-ఆర్ కారు 23.56 kmpl - 34.05 kmpl మైలేజ్ ఇస్తుంది.
7. Tata Tiago : ఈ టాటా టియాగో ప్రారంభ ధర రూ.5.6 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 86.5 bhp పవర్; సీఎన్‍జీ వేరియంట్ 72.4 bhp పవర్‌ను జనరేట్ చేస్తాయి. పెట్రోల్ కారులో 37 లీటర్స్, సీఎన్‍జీ కారులో 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ టాటా టియాగో కారు 19.43 kmpl - 20.01 kmpl మైలేజ్ ఇస్తుంది.
8. Hyundai Grand i10 Nios : ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్రారంభ ధర రూ.5.84 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ 82 bhp పవర్; సీఎన్‍జీ వేరియంట్ 68 bhp పవర్‌ను జనరేట్ చేస్తాయి. పెట్రోల్ కారులో 37 లీటర్స్, సీఎన్‍జీ కారులో 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు 16-18 kmpl మైలేజ్ ఇస్తుంది.
9. Maruti Suzuki Ignis : ఈ మారుతి సుజుకి ఇగ్నిస్ ప్రారంభ ధర రూ.5.84 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ 81.8 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 32 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ మారుతి సుజుకి ఇగ్నిస్ కారు 20.89 kmpl మైలేజ్ ఇస్తుంది.
10. Tata Punch : ఈ టాటా టియాగో ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 86.5 bhp పవర్; సీఎన్‍జీ వేరియంట్ 72.4 bhp పవర్‌ను జనరేట్ చేస్తాయి. పెట్రోల్ కారులో 37 లీటర్స్, సీఎన్‍జీ కారులో 60 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ టాటా టియాగో కారు 18.8 kmpl - 20.09 kmpl మైలేజ్ ఇస్తుంది.
'కైనెటిక్ ఇ-లూనా'కు గట్టి పోటీ ఇస్తున్న టాప్-2 వెహికల్స్ ఇవే! - Kinetic E Luna Vs Rivals Comparison