Things To Know Before Buying Two Wheeler Insurance : యువతకు బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంత మందికి టూ-వీలర్ కొనడం ఒక ఎమోషన్. అందుకే తాము కొనుగోలు చేసిన బైక్‌కు మంచి ఇన్సూరెన్స్ తీసుకుందామని అనుకుంటారు. కానీ మార్కెట్లో ఉన్న బీమా పాలసీలు అన్నీ చూసి, దేనిని ఎంచుకోవాలో తెలియక సందిగ్ధంతో పడతారు. మరి మీరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారా? అయితే ఇది మీ కోసమే!
వాహన బీమా విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో 2 రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అవి:
1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ : అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, వాహనదారునికి కాకుండా, అవతలి వ్యక్తికి పరిహారం చెల్లించేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. కానీ దీని వల్ల వాహనదారుడికి ఎలాంటి పరిహారం లభించదు. చట్ట ప్రకారం, వాహనదారులు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. శారీరక గాయాలు, మరణం, ఆస్తి నష్టం సంభవిస్తే ఈ బీమా పాలసీ కింద పరిహారం పొందవచ్చు.
2. కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ : ఈ సమగ్ర వాహన బీమా పాలసీ వలన విస్తృతమైన ప్రయోజనాలు లభిస్తాయి. దీని ద్వారా ప్రమాదం, దొంగతనం, అగ్ని ప్రమాదం సహా వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు. అంతేకాదు థర్డ్ పార్టీ వారికి వాటిల్లిన నష్టాన్ని కూడా ఇది భర్తీ చేస్తుంది.
How to Choose the Best Two Wheeler Insurance Policy :
- కవరేజీ : మీరు కొన్న బైక్ విలువతోపాటు, బండి వాడేతీరు, మీ బడ్జెట్ మొదలైన అంశాల ఆధారంగా మంచి కవరేజీ ఉన్న పాలసీని తీసుకోవాలి. థర్డ్-పార్టీ బీమాతోపాటు, సమగ్ర బీమా పాలసీ తీసుకుంటే అదనపు రక్షణ లభిస్తుంది.
- ఐడీవీ : వాహనం దొంగతనానికి గురైనప్పుడు లేదా పూర్తిగా వాహనాన్ని కోల్పోయినప్పుడు, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ) మనకు అక్కరకు వస్తుంది. దీని ద్వారా మార్కెట్లో సదరు బైక్ ధర ఎంత ఉంటుందో, అంత డబ్బులు మీకు పరిహారంగా లభిస్తాయి.
- యాడ్-ఆన్స్ : ప్రామాణిక పాలసీకి కొన్ని యాడ్-ఆన్స్‌ను కూడా జతచేసుకోవాలి. దీని వల్ల మీకు అదనపు భద్రత కలుగుతుంది. ముఖ్యంగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లాంటి యాడ్-ఆన్స్‌ను ఎంచుకోవాలి. వీటితో ప్రీమియం కాస్త ఎక్కువైనా, అత్యవసర సమయంలో ఇవే అక్కరకు వస్తాయి.
- సీఆర్‌ఎస్ : క్లెయిం సెటిల్మెంట్ రేషియో(CSR) అధికంగా ఉన్న బీమా సంస్థలను ఎంచుకోవాలి. దీనివల్ల పాలసీ క్లెయిం సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావు.
- నగదు రహిత మరమ్మత్తులు : వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు, సదరు బీమా సంస్థ, ప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మత్తులు చేయడానికి క్యాష్‌లెస్ నెట్వర్క్ గ్యారేజీ సదుపాయాల్ని అందిస్తోందా? లేదా? అనేది చూసుకోవాలి.
ఖర్చులు తగ్గాలంటే?
మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అందించే బీమా కవరేజీ ప్రయోజనాలు, ప్రీమియం, తగ్గింపులు మొదలైన అంశాలను పరిశీలించాలి. అలాగే వివిధ పాలసీలను సరిపోల్చుకోవాలి. మీ అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలో లభిస్తున్న పాలసీని ఎంచుకోవాలి.
ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏడాదిలో ఒక్కసారి కూడా దాన్ని వినియోగించుకోకపోతే, మీకు 'నో క్లెయిం బోనస్' వస్తుంది. దీని వల్ల తర్వాతి ఏడాది ప్రీమియంలో కొంత మేరకు రాయితీ లభిస్తుంది.
గడువులోగా ప్రీమియం చెల్లించి బీమా పాలసీలను పునరుద్ధరించుకుంటూ ఉండాలి. లేదంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. నో క్లెయిం బోనస్‌ను కూడా పొందలేము. కొన్నిసార్లు పూర్తిగా పరిహారమే రాకుండా పోతుంది.
2024 మార్చి నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!
అన్నదాతలకు గుడ్‌న్యూస్ - ఫిబ్రవరి 28న 'పీఎం కిసాన్ నిధులు' రిలీజ్ - ఎలా చెక్ చేసుకోవాలంటే?