Next Gen Maruti Suzuki Dzire 2024 : మారుతి కారు లవర్స్‌కు గుడ్ న్యూస్. న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారు నవంబరు 11న భారత విపణిలోకి రానుంది. ఇది మోడ్రన్ లుక్, కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు తెలుసుకోవాల్సిన 5 విషయాలను ఈ స్టోరీలో చూద్దాం.
న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కొత్త క్యాబిన్, ఎక్స్టీరియర్, కొత్త ఇంజిన్ ఆప్షన్లతో రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జనరేషన్ మారుతి సుజుకి డిజైర్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోంది. ఈ నేపథ్యంలో న్యూ-జెన్ మారుతి సుజుకి కూడా అంతే మొత్తంలో సక్సెస్ కావాలని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంచి ఫీచర్లతో దాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఎక్స్టీరియర్
ఈ ఫోర్త్ జనరేషన్ మారుతి సుజుకి డిజైర్ కొత్త ఇంటీరియర్ డిజైన్‌తో రానుంది. మారుతి సుజుకి డిజైర్ మంచి లుక్‌తో ఉంటుందని స్పై షాట్స్ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో అనేక హారిజాంటల్ క్రోమ్ స్లాట్లతో అలంకరించిన పెద్ద గ్రిల్, ఫాగ్ లైట్లతో కూడిన అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అదనంగా కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడీ లైట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇంటీరియర్
మారుతి సుజుకి స్విఫ్ట్‌తో పోలిస్తే న్యూ-జెన్ డిజైర్ భిన్నమైన ఇంటీరియర్‌తో లభిస్తుందని తెలుస్తోంది. ఇందులో మూడు స్పోక్ స్టీరింగ్ వీల్స్, కొత్త ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, లేయర్డ్ డ్యాష్ బోర్డ్ ఉండనున్నాయి. క్యాబిన్లో డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, లెదర్‌తో తయారుచేసిన ఫ్యాబ్రిక్ సీట్లతో ఈ కారు రానుంది.
ఫీచర్లు
ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్‌లో ఫీచర్లు ఎక్కువగా ఉండనున్నాయి. స్మార్ట్‌ప్లే ప్రో, 9 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లతో న్యూ-జెన్ మారుతి సుజుకి మార్కెట్లోకి రానుంది.
భద్రత
న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్‌లో సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువగా ఉండనున్నాయి. స్విఫ్ట్ మాదిరిగానే మారుతి సుజుకి డిజైర్లోనూ ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండే అవకాశం ఉంది. ఈబీడీ, పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి అదనపు భద్రతా ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇంజిన్ ఆప్షన్లు
స్విఫ్ట్‌లో ఉన్న ఇంజినే న్యూ జెన్ మారుతి సుజుకి డిజైర్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు రానున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 80 హెచ్‌పీ పవర్‌ను, 111 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ లభించనుంది. ఒక లీటర్ పెట్రోల్‌కు 24.8- 25.19 కి.మీ మైలేజీని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.