TCS Net Profit : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్చి త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తంగా చూసుకుంటే కంపెనీ ఆదాయం 3.5 శాతం పెరిగి రూ.61,237 కోట్లకు చేరింది. నిర్వహణ లాభాల మార్జిన్ కూడా 1.50 శాతం పెరిగి 26 శాతానికి చేరుకుంది.
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ, దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా లాభం, ఆదాయం సంపాదించడం విశేషం.
గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో టాటా గ్రూప్ కంపెనీ రూ.11,392 కోట్లు లాభాన్ని సంపాదించింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 9 శాతం పెరిగి రూ.45,908 కోట్లకు చేరిందని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
బెంచ్‌మార్క్ 1.06% కరెక్షన్తో పోలిస్తే, శుక్రవారం, బీఎస్ఈలో టీసీఎస్ షేర్ ధర 0.45 శాతం లాభంతో రూ.4000.30 వద్ద స్థిరపడింది.
మధ్యంతర డివిడెండ్ ప్రకటన
టీసీఎస్ మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. అంటే సంస్థ లాభాలు సంపాదించడమే కాదు, దానిని మదుపరులకు కూడా పంచుతోంది. దీని ప్రకారం మదుపరులకు ఒక్కో షేర్‌పై రూ.28 డివిడెండ్ రానుంది.
13.2 బిలియన్ డాలర్స్ వర్త్ డీల్స్!
టీసీఎస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తాము సాధించిన మొత్తం డీల్స్ గురించి కూడా వివరించింది. జనవరి- మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీ ఏకంగా 13.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ దక్కించుకుందని స్పష్టం చేసింది. భారత కరెన్సీలో దీని విలువ ఒక లక్షా పది వేల కోట్ల రూపాయలుగా ఉంటుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సాధించిన మొత్తంగా డీల్స్ విలువ 42.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో దీనిని లెక్కిస్తే, ఏకంగా రూ.3.57 లక్షల కోట్లు ఉంటుంది. ఇది ఆల్ టైమ్ హై డీల్ విన్స్‌గా టీసీఎస్ కంపెనీ పేర్కొంది. అంటే టీసీఎస్‌కు దక్కిన డీల్స్‌ను విలువ పరంగా చూస్తే, ఒక త్రైమాసికంలో అయినా, ఒక ఆర్థిక సంవత్సరంలో అయినా ఇదే అత్యధికమని చెప్పవచ్చు.
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Investing In Debt Funds
రూ.70వేలు బడ్జెట్లో మంచి టూ-వీలర్ కొనాలా? టాప్-10 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Bikes Under 70000