TATA's Business Journey : టాటా గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సాల్ట్(ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు దాదాపు 100 రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. అలాగే టీసీఎస్, టాటా మోటార్స్ వంటివి నెలకొల్పి రాణిస్తోంది. దాదాపు 150 ఏళ్లుగా దేశంలో వ్యాపార రంగంలో రాణిస్తున్న టాటా వంశవృక్షం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. జంషెడ్జీ టాటా నుంచి రతన్, మాయా టాటా వరకు వారు చేసిన వ్యాపారులు గురించి చూద్దాం.
జంషెడ్జీ టాటా
జంషెడ్జీ టాటా 1839వ సంవత్సరంలో గుజరాత్‌లోని నవసారి జిల్లాలో జన్మించారు. ఆయనకు దేశభక్తి ఎక్కువ. జంషెడ్జీ టాటా తన వ్యాపారాల వల్ల కొందరికైనా జీవనోపాధి ఇవ్వాలని అనుకునేవారు. 1868లో తొలుత పత్తి(కాటన్) వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లగ్జరీ హోటల్, తాజ్ హోటల్ వంటివి నిర్మించారు. జంషెడ్ మరణాంతరం తన వ్యాపార సామాజ్యాన్ని ఆయన కుమారుడు దొరాబ్జీ టాటాకు అప్పగించారు.
జంషెడ్ జీ టాటా చేసిన వ్యాపారాలు - పత్తి(కాటన్), స్టీల్, టెక్స్ టైల్స్
దొరాబ్జీ టాటా
దొరాబ్జీ టాటా 1959లో జన్మించారు. తన తండ్రి జంషెడ్జీ టాటా నుంచి వ్యాపార వారసత్వాన్ని అందుకున్నారు. వ్యాపారంలో తన తండ్రి సాధించాలనుకున్న వాటన్నింటినీ దొరాబ్జీ సాకారం చేశారు. టాటా గ్రూప్‌ను గణనీయంగా విస్తరించారు. దొరాబ్జీ టాటాకు క్రీడలంటే చాలా ఇష్టం. అందుకే 1924లో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి ఆర్థిక సాయం చేశారు. ఈయన తన భార్య మరణానంతరం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కులం, జాతి, మతం అనే తేడా అందరికీ సాయం చేస్తుంది. అలాగే పరిశోధనలకు చేయూతనిస్తుంది, విపత్తు ఉపశమన చర్యలు చేపడుతుంది. దీనిని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ అని పిలిచేవారు.
దొరాబ్జీ టాటా చేసిన వ్యాపారాలు - టాటా పవర్, న్యూ ఇండియా అస్యూరెన్స్ (ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది)
రతన్జీ టాటా
జంషెడ్జీ టాటా చిన్న కుమారుడైన రతన్జీ టాటా కూడా వ్యాపారంలో రాణించారు. ఈయన దానధర్మాలు ఎక్కువ చేసేవారు. రతన్జీ టాటా విపత్తు సహాయక చర్యలు చేపట్టేవారు. విద్యా సంస్థల కోసం, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు ఇచ్చేవారు. పురావస్తు శాఖ తవ్వకాలకు కూడా నిధులు సమకూర్చారు. 1916లో ఆయన తన సంపదలో గణనీయమైన భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చారు. 1919లో సర్ రతన్ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్జీ టాటా మరణాంతరం, వ్యాపారాలన్నింటినీ ఆయన భార్య నవజ్ భాయ్ సేట్ కొంత కాలం చూసుకున్నారు.
నావల్ టాటా
రతన్జీ టాటా కుమారుడే నావల్ టాటా. ఈయన కూడా వ్యాపారంలో రాణించారు. నావల్ టాటా కుమారుడు ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా. ఉక్కు, టాటా పవర్ వ్యాపారాలను ఆయన విజయపథంలో నడిపించారు.
రతన్ టాటా
1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా రతన్ టాటా వెలుగొందుతున్నారు. ఈయన హయాంలోనే టాటా గ్రూప్ ఉన్నత శిఖరాలకు చేరింది. 1991లో టాటాసన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు టాటా స్టీల్‌లో పలు పదవుల్లో పనిచేశారు. రతన్ టాటా దాతృత్వంలో ముందుంటారు. సంస్థ ఆదాయంలో ఎక్కువ భాగం విరాళంగా ఇస్తుంటారు. రతన్ టాటా వివాహం చేసుకోలేదు. ఈయన సామాన్యుల కోసం నానో కార్ ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. కానీ అది సత్ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఆయన వ్యాపారాలు అన్నీ మంచి లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
జిమ్మీ టాటా
జిమ్మీ టాటా రతన్ టాటా తోబుట్టువు. ఈమె ముంబయిలో నిరాండబర జీవితాన్ని గడుపుతున్నారు.
నోయల్ టాటా
నోయల్ టాటా రతన్ టాటా సవతి సోదరుడు. 1957లో జన్మించారు. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి ఆలూ మిస్త్రీని నోయల్ వివాహమాడారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం నోయల్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
నెవిల్లే టాటా
నెవిల్లే టాటా నోయల్ టాటా కుమారుడు. ఈయన జుడియో సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం ఇది వృద్ధిపథంలో నడుస్తోంది.
మాయా టాటా
మాయా టాటా నోయల్ టాటా కుమార్తె. ఈమె కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. టాటా గ్రూప్ సంస్థల బాధ్యతలను త్వరలో మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. 34 ఏళ్ల మాయా ఇటీవలే టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మాయాతో పాటు ఆమె సోదరి లేహ్, సోదరుడు నెవిల్లే కూడా టాటా గ్రూప్‌లోని కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వీరందరూ వాస్తవానికి రతన్ టాటా ఆధ్వర్యంలోనే వ్యాపార పాఠాలు నేర్చుకున్నారు.
మాయా టాటా యూకేలోని బేయర్స్ బిజినెస్ స్కూల్, ది యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో విద్యాభ్యాసం చేశారు. తరువాత టాటా గ్రూప్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. మొదటిగా ఆమె టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌లో పనిచేశారు. ఇది టాటా గ్రూప్‌నకు సంబంధించిన టాటా క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థ. అయితే ప్రస్తుతం దీనిని మూసేశారు. అయితే టాటాల వ్యాపార వారసత్వాన్ని ఈమే కొనసాగిస్తుందని సమాచారం.
ఇంకా ITR ఫైల్ చేయలేదా? టెన్షన్ పడొద్దు - మీరు చేయవలసింది ఏమిటంటే? - How to File Income Tax Returns
రూ.5 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-6 మోడల్స్ ఇవే! - Best Cars Under 5 Lakh