Stock Market Today September 26, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా దూసుకెళ్లాయి. లాభాలతో ప్రారంభమైన జంట సూచీలు లైఫ్ టైమ్ హై బెంచ్‌మార్క్‌ను టచ్ చేసి ముగిశాయి. బాంబో స్టాక్ ఎక్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 666 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠం 85,836 వద్ద ముగిసింది. నిఫ్టీ 211పాయింట్ల లాభంతో 26,216 వద్ద క్లోజ్ అయింది. మెటల్స్, ఆటోమొబైల్ రంగ షేర్లు 2శాతం చొప్పున పేరిగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 4 పైసలు పెరిగి 83.64 వద్ద ముగిసింది.
లాభపడిన స్టాక్స్
(సెన్సెక్స్ 30 సూచీ) మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్ర, బజాజ్ ఫిన్సెర్వ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్
నష్టపోయిన స్టాక్స్
(సెన్సెక్స్ 30 సూచీ) ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
యూఎస్, ఆసియా మార్కెట్లు
ఓవర్‌నైట్, వాల్‌స్ట్రీట్ సూచీలకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డోజోన్స్, S&P 500 దిగువన ముగిశాయి. నాస్డాక్ ఫ్లాట్లైన్కు ఎగువన ముగిసింది. ఇక ట్రేడింగ్ ప్రారంభంలో ఆసియా సూచీలు లాభపడ్డాయి.
బుల్ జోరుకు కారణాలేంటి?
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల చైనా- తిరోగమన బాటలో పయనిస్తున్న స్థిరాస్తి రంగానికి ఉద్దీపన పథకాలు ప్రకటించింది. క్యాష్ రిజర్వ్ రేషియో, కమర్షియల్ బ్యాంక్స్‌కు ఇచ్చే రుణాలపై వడ్డీ, ప్రాపర్టీ కొనుగోలుపై డౌన్‌పేమెంట్ శాతం వంటివి తగ్గించింది. ఇది మదుపర్ల విశ్వాసాన్ని పెచింది. ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో, ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. దీనికి తోడు అమెరికా స్టేబుల్ ఎకనామిక్ డేటా, మార్కెట్లలో ఆశావాద దృక్పథాన్ని కొనసాగిస్తోంది. అదేసమయంలో ఆర్థిక సంవత్సరం-2025 రెండో భాగంలో కార్పొరేట్ ఆదాయాలలో బలమైన వృద్ధి అంచనాలతో, భారత మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యయంతో ఈ పెట్టుబడులు ఊపందుకున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.