వరుసగా నాలుగోరోజు బుల్ జోరు కొనసాగింది. ఈ క్రమంలో ఎర్లీ ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ జీవన కాల గరిష్ఠాన్ని తాకాయి. కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 84,914 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 1 పాయింట్ వృద్ధిచెంది 25,940 వద్ద క్లోజ్ అయింది.
లాభాల్లో ఉన్న స్టాక్స్
టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్
నష్టాల్లో ఉన్న స్టాక్స్
హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్