ETV Bharat / business

మార్కెట్లకు 'ఫెడ్‌' జోష్‌ - ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌ను క్రాస్‌ చేసిన సెన్సెక్స్ & నిఫ్టీ - Stock Market Today

author img

By ETV Bharat Telugu Team

Published : 13 hours ago

Updated : 13 hours ago

Stock Market Today September 19, 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి.

Stock Market
Stock Market (Getty Images)

Stock Market Today September 19, 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 587 పాయింట్లు వృద్ధిచెంది 83,535 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 161 పాయింట్లు పెరిగి 25,539 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, కోటక్ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : హెచ్‌సీఎల్ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్‌

రూపాయి విలువ
Rupee Open September 19th, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 7 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.69గా ఉంది.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.1,154 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా నికరంగా రూ.152 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లు
గురువారం ఏసియన్ మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, సియోల్ ఒక్కటే నష్టాల్లో కొనసాగుతోంది. బుధవారం యూఎస్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కానీ ఫెడరల్ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నేడు యూఎస్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధర 0.07 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 73.60 డాలర్లుగా ఉంది.

Last Updated : 13 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.