ETV Bharat / business

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్​ 801 పాయింట్లు పతనం!

Stock Market Today 30 January 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 801 పాయింట్లు, నిఫ్టీ 215 పాయింట్లు మేర పతనం అయ్యాయి. బడ్జెట్​కు ముందు మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.

Share Market Today 30 January 2024
Stock Market Today 30 January 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 3:59 PM IST

Updated : Jan 30, 2024, 4:44 PM IST

Stock Market Today 30 January 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాలు స్వీకరించడం సహా, త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 801 పాయింట్లు నష్టపోయి 71,139 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 21,522 వద్ద ముగిసింది.

లాభపడిన స్టాక్స్​ : టాటా మోటార్స్​, హిందూస్థాన్ యూనిలీవర్, ఎస్​బీఐ, టెక్ మహీంద్రా, పవర్​గ్రిడ్​

నష్టపోయిన షేర్స్​ : బజాజ్ ఫైనాన్స్​, టైటాన్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎన్​టీపీసీ, రిలయన్స్​, ఐటీసీ, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

ఆసియా మార్కెట్లు
Asian Markets 30 Today January 2024 : టోక్యో మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. సియోల్​, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు మాత్రం​ భారీగా నష్టపోయాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్​ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
FII Investments Today 30 January 2024 : స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.110.01 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధర
Crude Oil Price Today 30 January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.21 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 82.57 డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Value Today 30 January 2024 : మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం యూఎస్ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.11గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices 30th January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

అయోధ్య యాత్రికులకు Paytm బంపర్ ఆఫర్​ - బస్, ఫ్లైట్​ బుకింగ్స్​పై 100% క్యాష్ బ్యాక్​!

2024లో లాంఛ్​ కానున్న టాప్​-10 ఈవీ కార్స్ ఇవే! వీటి రేంజ్ ఎంతంటే?

Last Updated : Jan 30, 2024, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.