Stock Market Closing Bell : శనివారం నిర్వహించిన స్పెషల్ లైవ్ ట్రేడింగ్ - రెండో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 88 పాయింట్లు లాభపడి 74,005 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధిచెంది 22,502 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, టాటామోటార్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హిందూస్థాన్ యూనిలివర్, ఎస్బీఐ
- నష్టపోయిన షేర్స్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టైటాన్
Stock Market Today May 18, 2024 : శనివారం నిర్వహించిన స్పెషల్ లైవ్ ట్రేడింగ్ - మొదటి సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 73,959 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 15 పాయింట్లు వృద్ధిచెంది 22,481 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్, టాటా స్టీల్, టాటామోటార్స్, టీసీఎస్, ఎస్బీఐ, ఏసియన్ పెయింట్స్, విప్రో
- నష్టపోయిన షేర్స్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా
Stock Market Special Live Trading Session On May 18, 2024 : ఈ రోజు శనివారం అయినప్పటికీ ప్రత్యేకంగా లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు. స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇది వరకే ఈ విషయాన్ని ప్రకటించాయి. ప్రధాన వెబ్‌సెట్ (ప్రైమరీ వెబ్‌సైట్)లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు లేదా వెబ్‌సైట్స్ క్రాష్ అయినప్పుడు, ఆ సమస్యను వేగంగా తీర్చేందుకు, ఎంత మేరకు సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని పరిశీలించేందుకు ఈ స్పెషల్ లైవ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలిపాయి.
టైమింగ్స్!
Stock Market Special Live Trading Session Timings : ఈ రోజు రెండు సెషన్లలో ట్రేడింగ్ జరుగుతుంది. ఈ స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ కేటగిరీల్లో ట్రేడింగ్ జరుగుతుంది.
- మొదటి సెషన్ ఉదయం 9.15 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఉంటుంది.
- రెండో సెషన్ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ స్వల్పకాలిక ట్రేడింగ్ సెషన్లో ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఇంట్రాడే స్విచ్ ఓవర్ ఉంటుంది. అయితే ఈ రెండు ట్రేడింగ్ సెషన్ల మధ్య కొంత సమయం గ్యాప్ ఇస్తారు. ఫస్ట్ సెషన్ ప్రాథమిక సైట్లో జరుగుతుంది. రెండో సెషన్ డిజాస్టర్ రికవరీ సైట్లో నిర్వహిస్తారు. ఈ రెండు సెషన్స్ మధ్య ఉన్న సమయంలో ట్రేడింగ్ మైగ్రేషన్ జరుగుతుందని స్టాక్ ఎక్స్చేంజీలు తెలిపాయి.
ప్రైస్ బ్యాండ్స్
ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో డెరివేటివ్స్ విభాగంలో అన్ని సెక్యూరిటీలు గరిష్ఠంగా 5% సర్క్యూట్ లిమిట్స్ మధ్యనే ట్రేడింగ్ కొనసాగిస్తాయి. ప్రైమరీ సైట్‌లోని ఈక్విటీ, ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ప్రైస్ బ్యాండ్లు, డిజాస్టర్ రికవరీ సైట్‌కు కూడా వర్తిస్తాయి. ప్రైమరీ సైట్లో క్లోజ్ టైమ్ వరకు జరిగే ట్రేడింగ్‌లో, మార్కెట్లో ఏవైనా కారణాలతో ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ప్రైస్ బ్యాండ్లలో మార్పులు ఉంటే, అవి డిజాస్టర్ సైట్‌కు ఫార్వర్డ్ అవుతాయని స్టాక్ ఎక్స్ఛేంజీలు స్పష్టం చేశాయి.
చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు - గోల్డ్@రూ.76,360 & సిల్వర్@రూ.92,449 - Gold Rate Today