ETV Bharat / business

భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు - జీవనకాల గరిష్ఠాలను తాకిన నిఫ్టీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 12:55 PM IST

Updated : Feb 2, 2024, 1:24 PM IST

Stock Market All Time High : దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 429 పాయింట్లు లాభపడి 22,126 వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 1444 పాయింట్లు వృద్ధి చెంది ఆల్​-టైమ్ హైరికార్డుకు చేరువైంది.

Stock Market All Time High
Stock Market All Time High

Stock Market All Time High : శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1444 పాయింట్లు లాభపడి రూ.73,089 వద్దకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధిచెంది 22,126 వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 604 పాయింట్లు పెరిగి 72,249 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 200 పాయింట్లు పుంజుకొని 21,898 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్​టీపీసీ, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, విప్రో, టాటా, సన్​ఫార్మా, ఎల్​ అండ్​ టీ, నెస్లేఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో రిలయన్స్‌ షేర్​ రూ.2,949.80 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.52,000 కోట్లు పెరగడం విశేషం.

కలిసొస్తున్న సానుకూల సంకేతాలు!
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు లేకపోవటం కారణంగా గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య మార్కెట్లు చలించాయి. కానీ శుక్రవారం దేశీయ స్టాక్​మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తున్నాయి. కేంద్రం మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు, జనరంజక ప్రకటనల జోలికి వెళ్లకపోవటం వల్ల మరోసారి సుస్థిర ప్రభుత్వం ఖాయమనే సంకేతాలు బలంగా వెళ్లాయి. ఇది కూడా సూచీల దూకుడుకు ఒక కారణంగా చెబుతున్నారు మార్కెట్​ నిపుణులు.

సెన్సెక్స్‌-30 సూచీలో లాభాల్లో కొనసాగుతున్న షేర్లు
భారతీఎయిర్​టెల్​, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్, టైటాన్​, మారుతి, ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగిస్తున్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, రిలయన్స్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు
ఆసియాలో సియోల్​, టోక్యో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండగా; షాంఘై, హాంకాంగ్​ మార్కెట్​లు నష్టాల్లో పయనిస్తున్నాయి. యూఎస్​ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

జియో Vs వీఐ పోస్ట్​ పెయిడ్​ ప్లాన్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్?

పేటీఎం షేర్లు మరో 20% పతనం - కంపెనీకి రూ.17వేల కోట్లకు పైగా నష్టం!

Last Updated : Feb 2, 2024, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.