ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ​ SIP స్ట్రాటజీ పాటిస్తే చాలు - లాభాలు గ్యారెంటీ! - SMART SIP TIPS

Smart SIP Tips : మీరు మ్యూచువల్ ఫండ్స్​లో సిప్​ (SIP) విధానంలో పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? అయితే ఈ బెస్ట్ సిప్​ స్ట్రాటజీ మీ కోసమే!

Mutual Funds SIP strategies
Mutual Funds SIP strategies (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 1:42 PM IST

Smart SIP Tips : నేడు మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఇవి నేరుగా స్టాక్ మార్కెట్​తో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నష్టభయాన్ని తగ్గించుకునేందుకు మంచి పెట్టుబడి వ్యూహాలను పాటించాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడో ఒకసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కన్నా, క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

నిధిని సృష్టించండి : అత్యవసర పరిస్థితుల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి డబ్బును తీయకుండా ఉండాలి. ఇందుకోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మీరు లిక్విడ్‌ ఫండ్లలో సిప్‌ చేయవచ్చు.

మధ్యస్థ కాలానికి : యువ పెట్టుబడిదారులకు కొన్ని మధ్యస్థ కాల లక్ష్యాలు ఉంటాయి. ఇలాంటి అవసరాల కోసం విడిగా ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఉదాహరణకు మీరు కారు కొనాలని ఆశపడవచ్చు. లేదా ఇంటి కోసం ముందస్తు చెల్లింపు చేయాలని అనుకోవచ్చు. ఇలాంటి వాటన్నింటికీ ప్రత్యేకంగా ఒక సిప్‌ను ప్రారంభించాలి. స్వల్పకాలిక డెట్‌ ఫండ్లను కూడా ఇందు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

దీర్ఘకాలిక లక్ష్యం : మీరు సాధించాల్సిన లక్ష్యం 15-20 ఏళ్లు లేదా అంతకు మించి ఉంటే, దీర్ఘకాలిక వ్యూహంతో ఇన్వెస్ట్​మెంట్ చేయాలి. పిల్లల ఉన్నత చదువులు, మీ పదవీ విరమణ లాంటివి ఇందుకు ఉదాహరణ. ఇందు కోసం నష్టభయాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా 80-90 శాతం వరకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలి.

కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించే వారు సెన్సెక్స్​, నిఫ్టీ సూచీల ఆధారంగా పనిచేసే లార్జ్‌ క్యాప్‌ ఫండ్లను పరిశీలించాలి. ఈక్విటీలు అంటేనే అస్థిరతకు మారుపేరు. కనుక మార్కెట్ ఒడుదొడుకులకు మీరు మానసికంగా సిద్ధపడాలి. ఇందుకోసం కనీసం రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాతే నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ వంటి వాటికి కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని కేటాయించాలి.

పెట్టుబడుల్లో కాస్త అనుభవం వచ్చాక, దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోవాలి. ఇందులో 70-80% వరకు నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్స్​, వాల్యూ ఫండ్, లో వొలటాలిటీ ఫండ్స్​ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాతే అధిక రాబడి కోసం ప్రయత్నించాలి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్లలో అస్థిరత అధికంగా ఉంటుంది. అదే సమయంలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీకు అనుభవం వచ్చాకే వీటిపై దృష్టి పెట్టాలి.

వైవిధ్యంగానూ : మీ దగ్గర ఉన్న డబ్బు అంతటినీ కేవలం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. డెట్, బంగారం, ఇతర పథకాలనూ పరిశీలించాలి. పెట్టుబడుల్లో కనీసం 20 శాతం వరకు వీటికి కేటాయించాలి. అప్పుడే పోర్ట్‌ఫోలియో స్థిరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది.

ఇవీ ముఖ్యమే!

  • మార్కెట్‌ ఒడుదొడుకుల సమయంలో క్రమశిక్షణతో ఉండాలి. ఫండ్‌లను ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం స్వల్పకాలిక రాబడిపైనే దృష్టి పెట్టకూడదు.
  • ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన ఫండ్లనే ఎంచుకోవాలని అనుకోవద్దు. దాని ఫండమెంటల్స్ తెలుసుకోండి. భవిష్యత్​లో అది వృద్ధి చెందుతుందా? లేదా? అనేది కూడా బేరీజు వేసుకోండి.
  • దశల వారీగా పెట్టుబడులు కొనసాగించండి. మార్కెట్‌ పడిపోతున్నప్పుడు కూడా పెట్టుబడులు కొనసాగాలి. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడంపైనే దృష్టి సారించండి.
  • ప్రారంభంలోనే ఒకే రంగానికి పరిమితమయ్యే సెక్టోరియల్‌ ఫండ్లపై ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. మీ పోర్ట్​ఫోలియో వైవిధ్యంగా ఉండేలా చూసుకోండి.

డైరెక్ట్ Vs రెగ్యులర్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ - వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్‌? - Direct Vs Regular Mutual Funds

లార్జ్​ క్యాప్ Vs మిడ్​ క్యాప్ Vs స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Different Mutual Funds

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.