ETV Bharat / business

ఇతరుల రుణానికి హామీ సంతకం పెడుతున్నారా? సైన్​ చేసే ముందు ఈ విషయాలు అస్సలు మరవొద్దు! - Guarantor Of Loan - GUARANTOR OF LOAN

Risks Of Loan Guarantor : డబ్బుతో ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో చెప్పడం కష్టమే. డబ్బు అవసరం వచ్చినప్పుడు చాలా మంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు గ్యారంటీ కోరతాయి. చాలా మంది స్నేహితుడు, బంధువులు లేదంటే సహోద్యోగి అడిగారని బ్యాంక్ లోన్‌కు హామీగా సంతకం పెడుతుంటారు. అయితే రుణగ్రహీత ఆ లోన్ తీర్చకపోతే గ్యారంటీ సంతకం పెట్టినవారు పడే ఇబ్బందులు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Risks Of Loan Guarantor
Risks Of Loan Guarantor (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 12:34 PM IST

Risks Of Loan Guarantor : గృహ, వాహన రుణాలు, వ్యాపారానికి పెద్ద మొత్తంలో అప్పు తీసుకునే వారి విషయంలో బ్యాంకులు, రుణ సంస్థలు ఎవరినైనా హామీగా చూపించాలని కోరుతుంటాయి. దీంతో కాస్త హామీ సంతకం చేస్తారా? అంటూ మీ స్నేహితుడో, బంధువో అడిగితే మీరు కాదనలేకపోవచ్చు. మీ మ‌ధ్య ఉన్న స్నేహమో, బంధుత్వమో లేదా మొహ‌మాటం కొద్దో అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. దాని వెనకున్న రిస్క్‌ గురించి ఏమాత్రం ఆలోచించరు. నిజంగా మీరు గ్యారంటీ సంతకం పెడుతున్న వ్యక్తి నమ్మకస్థుడైతే ఫరవాలేదు. కానీ, ఏవైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి హామీ కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఆ భారం మొత్తం మీరే మోయాల్సి రావొచ్చు.

రిస్క్​ ఎంతో తెలుసుకోవాలి!
ఇతరులు తీసుకున్న లోన్​కు హామీ ఇస్తున్నామంటే మనకూ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే, ఓకే అనే ముందు మీపై దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
ఎవరికైనా రుణ హామీదారుడిగా ఉండే ముందు లోన్ తీసుకునే వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. రుణగ్రహీత లోన్ తిరిగి చెల్లించగలరా? క్రెడిట్ యోగ్యత, రుణ ప్రయోజనం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలను పరిశీలించాలి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి దానిని చెల్లించడంలో విఫలమైతే, దాన్ని మీరే చెల్లించాల్సి రావొచ్చు. ఎందుకంటే రుణదాత తన డబ్బును పొందడానికి మీ వద్దకే వస్తారనే విషయం మర్చిపోవద్దు.

హామీదారుడికే నోటీసులు
రుణగ్రహీత కొన్నిసార్లు ఉద్యోగం కొల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సంక్షోభం వంటి కారణాల వల్ల బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమవ్వొచ్చు. ఆ సమయంలో రుణగ్రహీత హామీదారుడితో కమ్యూనికేషన్ తగ్గిస్తారు. ఆ తర్వాత పూర్తిగా కాంటాక్ట్​లో ఉండరు. రుణగ్రహీత ఆర్థికంగా ఎలా ఉన్నాడో మీకు తెలియదు. ఏదో ఒకరోజు అతడు గత కొన్ని నెలలుగా లోన్ ఈఎమ్​ఐలు చెల్లించట్లేదని మీకు తెలుస్తుంది. అప్పుడు బ్యాంకు మీకు నోటీసులు ఇస్తుంది. ఆ సమయంలో మీరు రుణగ్రహీతను సంప్రదించడానికి ప్రయత్నించినా మీకు వాళ్లు స్పందించకపోవచ్చు.

రిస్కులు ఇవే!
చాలా మంది తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవుతారు. అప్పుడు రుణదాత మొదట రుణగ్రహీతను లోన్ చెల్లించమని సంప్రదిస్తారు. అప్పుటికీ ఆ వ్యక్తి రుణాన్ని చెల్లించకపోతే ఈఎమ్​ఐ, ఆలస్య రుసుములను చెల్లించమని గ్యారంటీ సంతకం పెట్టినవారిని సంప్రదిస్తుంది. హామీదారుడు కూడా లోన్ బకాయిలు కట్టకపోతే, అతడి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసే హక్కు బ్యాంకుకు ఉంటుంది. అలాగే లోన్ హామీదారుడి క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతింటుంది. భవిష్యత్తులో లోన్లు పొందడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

రుణగ్రహీత లోన్​పై డిఫాల్ట్ అయినట్లయితే బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత హామీదారుడికి బదిలీ అవుతుంది. అందుకే మీరు ఇతరుల లోన్లకు గ్యారెంటీ సంతకం పెట్టేటప్పుడు అతడి ఆర్థిక క్రమశిక్షణను గమనించండి. లేదంటే లోన్ తీసుకున్న వ్యక్తి రుణం కట్టకపోతే, అప్పుడు గ్యారంటీ సంతకం పెట్టిన వారు ఆ రుణం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

పర్సనల్​ లోన్​ తీసుకోవాలా? అత్యవసర నిధి వాడాలా? ఏది బెస్ట్ ఆప్షన్​? - Emergency Fund Vs Personal Loan

హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంకులు పరిగణనలోకి తీసుకునే అంశాలివే! - Home Loan Eligibility

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.