ETV Bharat / business

ఫిక్స్‌డ్ డిపాజిట్​ చేయాలా? అయితే ఈ 4 రిస్క్​లు గురించి తెలుసుకోండి! - Risks In Fixed Deposits - RISKS IN FIXED DEPOSITS

Risks In Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే చాలా సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి అని చాలా మంది న‌మ్మ‌కం. ఎఫ్​డీలు గ్యారెంటీ రిటర్స్న్​లు ఇవ్వ‌డమే అందుకు కార‌ణం. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనూ కొన్ని రిస్క్​లు ఉంటాయి. వాటిలో 4 ప్రధానమైన రిస్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Is there any risk in FD?
Pros and Cons of Bank Fixed Deposits (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 12:19 PM IST

Risks In Fixed Deposits : భారతదేశంలో చాలా మంది ఎంచుకునే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒక‌టి. అందులో పెట్టుబ‌డి పెడితే, గ్యారెంటీ రిటర్న్స్​ వస్తాయని నమ్మకం. అందులో నిజం లేక‌పోలేదు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు సుర‌క్షిత‌మైనప్పటికీ, అందులోనూ కొన్ని రిస్క్​లు ఉన్నాయి. అవేెంటో ఇప్పుడు చూద్దాం.

ఇటీవల మ‌న దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు పెరిగాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం, సాధారణ డిపాజిటర్లకు 7.75 శాతం చొప్పున వ‌డ్డీ రేట్లను అందిస్తున్నాయి. చాలా ఎఫ్​డీలు స‌మ‌యాన్ని బ‌ట్టి స్థిర‌మైన వ‌డ్డీ రేటును అందిస్తాయి. దీని వ‌ల్ల కొన్ని లాభాలున్నాయి. అయితే బ్యాంకుల్లో పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు ఎలాంటి రిస్క్ ఉండ‌ద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ పూర్తిగా రిస్క్ లేని పెట్టుబ‌డి అంటూ ఏం ఉండ‌దు. మిగ‌తా వాటితో పోలిస్తే ఫిక్స్​డ్ డిపాజిట్లలో రిస్క్ కాస్త త‌క్కువ‌ మాత్రమే. మీరు ఏవైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే ఈ కింది 4 రిస్కుల గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

1. డిఫాల్ట్ : మన దేశంలో చాలా బ్యాంకులు దివాలా తీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మదుపరులు, ఖాతాదారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే మ‌న దేశంలో డిపాజిట్ల మీద‌ 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC)' అనేది ఒక్కో బ్యాంక్ ఖాతాదారునికి రూ.5 లక్షల వరకు బీమా కల్పిస్తుంది. ఒక‌వేళ మీ బ్యాంకు బోర్డు తిప్పేస్తే, మీరు పొదుపు చేసిన మొత్తం అమౌంట్ మీకు రాదు. కేవలం నిర్దేశిత బీమా అమౌంట్ మాత్రమే మీకు లభిస్తుంది.

2. వ‌డ్డీ రేటు : ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిర్ద‌ష్ట కాలపరిమితికి, స్థిర‌మైన వ‌డ్డీ రేటును అందిస్తాయి. ఇది కొంత వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉన్న‌ప్ప‌టికీ, న‌ష్టం కూడా ఉంది. ఒక‌వేళ మీరు ఫిక్స్​డ్ డిపాజిట్ చేసిన త‌ర్వాత కొన్ని రోజుల‌కు మార్కెట్​లో వ‌డ్డీ రేటు పెరిగితే, అది మీ పెట్టుబ‌డికి వ‌ర్తించ‌దు. మీరు ముందుగా ఒప్పందం చేసుకున్న వడ్డీ రేటుకే క‌ట్టుబ‌డి ఉండాల్సి ఉంటుంది. ఒక ర‌కంగా ఇది మిమ్మ‌ల్ని నిరుత్సాహానికి గురి చేసే ఛాన్స్ ఉంది.

3. ద్ర‌వ్యోల్బ‌ణం : దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగితే, మీ ఫిక్స్​డ్ డిపాజిట్​లోని డబ్బు విలువ తగ్గిపోతుంది. ఫలితంగా మీ కొనుగోలు శక్తి తగ్గుతుంది. ద్ర‌వ్యోల్బ‌ణం కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటే, అది మీ రాబ‌డిపైనా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫ్​డీల్లో స్థిరమైన వడ్డీ రేట్లు ఒక‌రకంగా స్థిరత్వాన్ని అందించినప్పటికీ, అవి ద్రవ్యోల్బణ స‌మ‌యంలో మ‌న‌ల్ని ఆదుకోలేవు.

4. లిక్విడిటీ : ఫిక్స్​డ్ డిపాజిట్ల​కు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ స‌మ‌యంలో మీరు ఆ డ‌బ్బును బ‌య‌టికి తీయ‌డానికి వీలుండదు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప, మిగిలిన స‌మ‌యాల్లో వాడుకునే అనుమ‌తి ఉండ‌దు. ఒకవేళ మధ్యలోనే డిపాజిట్ చేసిన న‌గ‌దును వాడుకోవాల‌నుకుంటే, అందుకు పెనాల్టీలు క‌ట్టాల్సి ఉంటుంది. ఇది వ‌డ్డీ రేటుపై ప్ర‌భావం ప‌డుతుంది. ఫ‌లితంగా అనుకున్న దాని కంటే త‌క్కువ వ‌డ్డీ రేటు వ‌స్తుంది.

గూగుల్‌ మ్యాప్స్‌కు ఓలా గుడ్​బై - ఇకపై సొంత మ్యాప్స్​తోనే నావిగేషన్​!

కష్టపడి ఇల్లు కట్టుకున్నారా? బీమా చేసి ధీమాగా ఉండండి! - Home Insurance Policy Benefits

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.