ETV Bharat / business

రిలయన్స్‌, డిస్నీ డీల్‌ ఖరారు- 120 ఛానళ్లు ఒకే గొడుకు కిందకు - walt disney reliance merger

Reliance Walt Disney Merger : రిలయన్స్‌, డిస్నీల మధ్య విలీన ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్థలు కలిసి అతిపెద్ద మీడియా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ డీల్‌ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఇరు సంస్థలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి.

Reliance Walt Disney Merger
Reliance Walt Disney Merger
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:33 PM IST

Reliance Walt Disney Merger : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్‌ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్‌ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఇరు సంస్థలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి.

ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్‌ వెంచర్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్‌ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దాఖలు పడనున్నాయి. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్‌ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారు.

'సరికొత్త శకానికి నాంది'
భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లు అయ్యిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌గా ఉన్న డిస్నీతో వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు అందుబాటు ధరకే కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని పేర్కొన్నారు. డిస్నీని రిలయన్స్ గ్రూప్‌లో కీలక భాగస్వామిగా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్‌తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించనున్నామని, ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని వాల్ట్‌ డిస్నీ సీఈఓ బాబ్‌ ఐగర్‌ తెలిపారు.

ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 2024 చివరి త్రైమాసికంలో గానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విలీనానంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. స్టార్‌ ఇండియాతో పాటు రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 సంబంధించిన మొత్తం 120 టెలివిజన్‌ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్‌, జియో సినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి.

జంతువులపై అంబానీల ప్రేమ- 3 వేల ఎకరాల్లో 'వన్​తారా' అడవి సృష్టించిన రిలయన్స్ ఫౌండేషన్

'దేశ చరిత్రలోనే విజయవంతమైన ప్రధాని మోదీ- ఆయన వల్లే ఈ మార్పు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.