ETV Bharat / business

యూపీఐ లైట్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇకపై బ్యాలెన్స్ తగ్గినా నో వర్రీస్​! - UPI Lite Automatic Replenishment

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 1:01 PM IST

RBI Permits Automatic Replenishment Of UPI Lite Wallet : డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్​ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడు, వినియోగదారులు ఆటోమేటిక్​గా దానిని రీఫిల్​ చేసుకునేందుకు వీలు కల్పించాలని ప్రతిపాదించింది. పూర్తి వివరాలు మీ కోసం.

UPI Lite wallet
UPI payments (Getty Images)

RBI Permits Automatic Replenishment Of UPI Lite Wallet : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్నచిన్న (స్మాల్-వాల్యూ) డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందుకే వినియోగదారులు వారి 'యూపీఐ లైట్' వాలెట్లను ఆటోమేటిక్​గా రీఫిల్​ (బ్యాలెన్స్ రీప్లెనిష్​మెంట్) చేసుకునేందుకు వీలు కల్పించాలని ప్రతిపాదించింది.

ప్రస్తుతం యూపీఐ లైట్​ ద్వారా రోజుకు గరిష్ఠంగా రూ.2000 పరిమితి వరకే చెల్లింపులు చేసే అవకాశం ఉంది. సింగిల్ పేమెంట్ చేయాలంటే గరిష్ఠంగా రూ.500 వరకు మాత్రమే అనుమతి ఉంది. దీనిని పెంచాలని ఆర్​బీఐ భావిస్తోంది.

'యూపీఐ లైట్' అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్​ఫేస్​ (UPI)కు సంబంధించిన సరళీకృతమైన వెర్షన్​. ఇది చిన్నచిన్న లావాదేవీలు చేయడానికి ఆన్​-డివైజ్​ వాలెట్​గా పనిచేస్తుంది.

"యూపీఐ లైట్​ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం యూపీఐ లైట్​ వాలెట్​లో నిర్దేశిత థ్రెషోల్డ్​ పరిమితి కంటే బ్యాలెన్స్​ తగ్గినప్పుడు, వినియోగదారులు ఆటోమేటిక్​గా తమ వాలెట్​లను తిరిగి నింపుకునే (రీఫిల్ చేసుకునే) సదుపాయాన్ని కల్పించాలి. ఈ విధంగా దీనిని ఈ-మాండెట్​ ఫ్రేమ్​వర్క్​ కిందకు తీసుకురావాలని మేము ప్రతిపాదించాం."
- శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్

శుక్రవారం ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించింది. అందులో భాగంగానే చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సాహించాలని ఆర్​బీఐ నిర్ణయించింది.

యూపీఐ లైట్​
ఆన్​-డివైజ్​ వాలెట్ ద్వారా చాలా వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుగా 2022 సెప్టెంబర్​లో యూపీఐ లైట్​ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా సులువుగా చిన్న చిన్న డిజిటల్ చెల్లింపులు చేయడానికి వీలైంది.

ఫాస్టాగ్​, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్​ (NCMC) మొదలైన వాటిలో కూడా 'బ్యాలెన్స్ రీప్లెనిష్​మెంట్'​ చేయాలని ప్రతిపాదించింది. అంటే కస్టమర్ల వాలెట్​లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, ఆటోమేటిక్​గా ఆ బ్యాలెన్స్​ను తిరిగి నింపుకునేలా (రీఫిల్​) చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. అయితే దీనికి నిర్దేశిత సమయం అంటూ ఏమీ లేకుండా ఈ-మాండేట్​ ఫ్రేమ్​వర్క్​లో చేర్చాలని ఆర్​బీఐ నిర్ణయించింది. దీని వల్ల ఫాస్టాగ్​, ఎన్​సీఎంసీ లాంటి వాటిల్లో కస్టమర్లు నిర్దేశించుకున్న థ్రెషోల్డ్ లిమిట్​ కంటే బ్యాలెన్స్ తగ్గినప్పుడు, ఆటోమేటిక్​గా బ్యాలెన్స్​ను రీఫిల్​ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం - EMI భారం యథాతథం - RBI Monetary Policy June 2024

రూ.75,600 దాటిన బంగారం - రూ.95,500కు చేరిన వెండి - Gold Rate Today

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.