ETV Bharat / business

పరిమితికి మించి క్రెడిట్ కార్డు వాడొచ్చా? ఆర్​బీఐ లేటెస్ట్ రూల్స్ ఇవే! - RBI Guidelines Credit Card Limit - RBI GUIDELINES CREDIT CARD LIMIT

RBI Guidelines For Credit Card Limit : క్రెడిట్ కార్డు వినియోగదారులకు అనేక అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా క్రెడిట్​ కార్డ్​ను పరిమితికి మించి వాడవచ్చా? లేదా? ఒక వేళ లిమిట్​కు మించి వాడితే ఏమౌంది? ఈ సందేహాలు అన్నింటికీ ఆర్​బీఐ ఇటీవలే సమాధానాలు ఇచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

credit card usage limit in telugu
RBI Guidelines For Credit Card Limit
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 5:20 PM IST

RBI Guidelines For Credit Card Limit : ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. షాపింగ్స్, బిల్ పేమెంట్స్ వంటి వాటికి క్రెడిట్ కార్డులను నిత్యం ఎంతోమంది వినియోగిస్తున్నారు. వీటిని ఉపయోగించే విషయంలో యూజర్లకు చాలానే సందేహాలు ఉంటాయి. ఈఎంఐ నుంచి బిల్ సైకిల్ దాకా వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు అనుమానాలు వస్తుంటాయి. ఇలా తరచుగా ఎదురయ్యే సందేహాలకు ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమాధానాలు ఇచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు జారీ
కస్టమర్ల అనుమతితోనే కొత్త క్రెడిట్‌ కార్డును బ్యాంకులు జారీ చేయాలి. ఒకవేళ అప్లై చేయకున్నా కార్డును పంపితే దానిని యాక్టివేట్‌ చేయకూడదు. కస్టమర్లు రిక్వెస్ట్ చేసిన ఏడు రోజుల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా క్రెడిట్‌ కార్డు అకౌంటును బ్యాంకులు మూసేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సమాచారాన్ని కస్టమర్‌కు చేరవేయాలి. అనంతరం కస్టమర్‌ ఆ క్రెడిట్ కార్డును ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఏదైనా సమస్య తలెత్తితే ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌కు కస్టమర్ ఫిర్యాదు చేయొచ్చు.

బిల్లింగ్‌ సైకిల్‌ తేదీని మార్చుకోవచ్చా?
క్రెడిట్ కార్డు బిల్ సైకిల్ ఏ తేదీన మొదలు కావాలి? ఏ తేదీన ముగియాలి? అనేది డిసైడ్ చేసుకోవడానికి, కనీసం ఒకసారైనా వాటిని మార్చుకోవడానికి కస్టమర్లకు బ్యాంకులు ఆప్షన్‌ ఇవ్వాలి. హెల్ప్‌లైన్‌, ఈ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్‌ రెస్పాన్స్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌ వంటి వాటి ద్వారానూ బిల్లింగ్ సైకిల్‌ తేదీలలో మార్పులు చేయాలని యూజర్లు కోరవచ్చు.

క్రెడిట్‌ లిమిట్ ఎంత వరకూ?
ప్రతీ క్రెడిట్‌ కార్డుపై ఎంత మొత్తాన్ని వాడుకోవచ్చు అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒకవేళ అర్హులైన కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తే క్రెడిట్ లిమిట్‌కు మించి డబ్బును వాడుకునే ఆప్షన్‌ను బ్యాంకులు ఇవ్వొచ్చు. అవసరం లేదనుకుంటే లిమిట్‌కు మించి ఖర్చు చేసేలా ఇచ్చిన ఆప్షన్‌ను డీయాక్టివేట్‌ చేసుకోవచ్చు. అయితే కస్టమర్‌కు చెప్పకుండా ఎక్స్​ట్రా క్రెడిట్ లిమిట్ ఇవ్వడం, దానిపై ఛార్జీలను బాదడం అనేది బ్యాంకులు చేయకూడదు. యూజర్లపై ఓవర్‌ లిమిట్‌ ఛార్జీలను వేసేటప్పుడు వడ్డీ, రుసుములను క్రెడిట్‌ లిమిట్‌ పరిధిలోకి తీసుకోవద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

లావాదేవీ చేయకపోయినా కార్డు యూజ్‌ చేసినట్లేనా?
ఆర్థిక లావాదేవీలు చేస్తేనే క్రెడిట్ కార్డును వాడినట్టుగా మీరు భావిస్తున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ తీయడం, పిన్‌ మార్చడం, లావాదేవీల పరిమితిని సవరించడం వంటి యాక్టివిటీస్​ అన్నీ కార్డు వినియోగం కిందకే వస్తాయి. అయితే ఇతర కారణాలతో కస్టమర్‌ కేర్ సెంటర్‌కు కాల్‌ చేస్తే మాత్రం కార్డు ఉపయోగిస్తున్నట్లుగా లెక్కలోకి తీసుకోరు.

పాక్షిక చెల్లింపులపై వడ్డీ, రుసుములు వర్తిస్తాయా?
క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్‌కు ఒక లాస్ట్ డేట్ ఉంటుంది. దాన్ని తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఆలోగా బిల్లు కట్టకపోతే వడ్డీ రహిత గడువు ప్రయోజనం కస్టమర్‌కు లభించదు. పాక్షిక చెల్లింపులు చేస్తే మిగిలిన మొత్తంపై మాత్రమే లావాదేవీ జరిగిన రోజు నుంచి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బకాయి అమౌంటుపై ఇతరత్రా ఛార్జీలు కూడా పడతాయి.

బకాయిల బాధ్యత ప్రధాన కార్డు హోల్డర్లదేనా?
ప్రతీ క్రెడిట్‌ కార్డుపై మనం యాడ్-ఆన్‌ కార్డును తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా తీసుకుంటే కార్డుపై ఉన్న బకాయిలను చెల్లించే బాధ్యత ప్రధాన కార్డుదారుడిపైనే ఉంటుంది. అయితే బిజినెస్‌ క్రెడిట్‌ కార్డుల విషయంలో రూల్ మరోలా ఉంటుంది. ఈ కార్డ్ హోల్డర్లకు ఒప్పందాల మేరకు చెల్లింపులను డివైడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు.

బిజినెస్‌ క్రెడిట్‌ కార్డు విషయంలో అనుమతి తీసుకోవాలా?
కార్పొరేట్ సంస్థలకు, వ్యాపార సంస్థలకు బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తుంటారు. ఈ కార్డుల యాక్టివేషన్‌, క్లోజర్‌కు ముందు కచ్చితంగా వాటికి బ్యాంకులు సమాచారాన్ని అందించాలి. ఒకవేళ ఒప్పందంలో ఈ విషయంపై మినహాయింపు ఉంటే మాత్రం సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. రిటైల్‌ కార్డుల విషయంలోనూ ప్రధాన కార్డుదారుడి నుంచి పర్మిషన్ తీసుకోకుండా, యాడ్‌-ఆన్‌ కార్డు హోల్డర్ల అభ్యర్థన మేరకు కార్డును క్లోజ్‌ చేయకూడదు.

క్రెడిట్‌ కార్డ్ ఇన్సూరెన్స్‌ ఇవ్వాల్సిందేనా?
క్రెడిట్‌ కార్డుపై కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంటాయి. అయితే ఆ సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలనే రూలేదీ లేదు. ఒకవేళ బీమా సౌకర్యాన్ని కస్టమర్లకు కల్పించాలని భావిస్తే నామినీ సహా, బీమా వివరాలను ప్రతి స్టేట్‌మెంట్‌లో విధిగా ప్రస్తావించాలని ఆర్‌బీఐ తెలిపింది. పాలసీ పేరు, బీమా కంపెనీ అడ్రస్, ఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ అయితే, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా అందించాలి.

ఫిర్యాదులు చేయడం ఎలా?
క్రెడిట్ కార్డుతో ముడిపడిన సేవలలో ఏదైనా అసౌకర్యం కలిగితే కస్టమర్లు నేరుగా బ్యాంకుకు ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసి లేదంటే మెయిల్ చేసి తమ అసౌకర్యాన్ని వివరించొచ్చు. ఒకవేళ 30 రోజుల్లోగా స్పందించకున్నా, ఫిర్యాదును రిజెక్ట్ చేసినా కస్టమర్లకు మరో మార్గం రెడీగా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవం ఎదురయిన కస్టమర్లు నేరుగా ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్​ లేదా ఆఫ్​లైన్​ విధానంలో ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదును సమర్పించొచ్చు.

కార్డు డీయాక్టివేషన్‌/బ్లాక్‌
క్రెడిట్‌ కార్డును చాలా మంది డీయాక్టివేషన్‌ లేదా బ్లాక్‌ మోడ్‌లో ఉంచుతారు. ఇలా ఉంచినంత మాత్రాన క్రెడిట్ కార్డు అకౌంట్ క్లోజ్ అయినట్టు కాదు. డీయాక్టివేషన్‌ లేదా బ్లాక్‌ మోడ్‌లో ఉన్నప్పుడు క్రెడిట్ కార్డును వాడుకోవడం కుదరదు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు వద్దని భావిస్తే ఆ అకౌంటును మూసేయాలని బ్యాంకుకు ప్రత్యేకంగా రిక్వెస్టు పెట్టాల్సి ఉంటుంది. కస్టమర్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చాక ఏడు రోజుల్లోగా సదరు ఖాతాను బ్యాంకులు మూసేయాలి. ఏమైనా బకాయిలు ఉంటే కస్టమర్‌కు తెలియజేయాలి. పెండింగ్ పేమెంట్స్ కట్టాక ఏడు రోజుల్లోగా ఖాతాను మూసేయాలి.

మారుతి, టాటా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.50 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In April 2024

బీఎస్​ఈ Mcap ఆల్​-టైమ్ హైరికార్డ్​ - తొలిసారిగా రూ.400 లక్షల కోట్లు క్రాస్​! - BSE Mcap All Time High Record

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.