ETV Bharat / business

మీ ఆర్థిక భవిష్యత్ అద్భుతంగా ఉండాలా? సొంత 'బడ్జెట్ ప్లాన్'​ తయారు చేసుకోండిలా!​ - Personal Finance Tips - PERSONAL FINANCE TIPS

Personal Finance Tips : చాలా మంది 'బడ్జెట్‌' అనే పదాన్ని తమకు సంబంధం లేని అంశంలా చూస్తుంటారు. వాస్తవానికి వ్యక్తిగత బడ్జెట్‌ను తయారు చేసుకోకుండా మనం జీవితంలో పురోగమించలేం. మన ఆర్థిక పురోగతికి అదే దిక్సూచి. బడ్జెట్‌ను తయారు చేసుకుంటే మన పర్సనల్ ఫైనాన్స్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఆర్థిక నిర్ణయాల్లో పరిపక్వత ప్రతిబింబిస్తుంది.

Personal Finance Tips
Personal Finance Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 11:49 AM IST

Personal Finance Tips : 'బడ్జెట్' అనేది దేశానికి, సంస్థలకు ఎంత ముఖ్యమో, ప్రతీ వ్యక్తికీ అంతే అవసరమవుతుంది. ప్రతీ ఒక్కరు ఒక బడ్జెట్ ప్లాన్‌ను రెడీ చేసుకోవాలి. ఆదాయం, అప్పులు, పొదుపులు, రుణాలు, ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఇది ఒక దిక్సూచిలా మన ఆర్థిక భవితకు సురక్షిత మార్గాన్ని చూపిస్తుంది. ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంతకీ పర్సనల్ ఫైనాన్స్‌కు, బడ్జెటింగ్‌కు మధ్యనున్న సంబంధం ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రయోజనాలు

  • ఆర్థిక క్రమశిక్షణ : బడ్జెట్‌ను ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఆదాయంలో పొదుపులు ఏమిటి? ఖర్చులు ఏమిటి? అనే దానిపై మీకు క్లారిటీ వస్తుంది. దీనివల్ల మీరు ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చుపెడతారు.
  • ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది : మీ ఖర్చులేంటి అనే దానిపై మీకు ముందస్తు క్లారిటీ వస్తుంది. దీని వల్ల మీపై అంతగా ఒత్తిడి ఉండదు.
  • అత్యవసర నిధిని సృష్టించండి : మీ ఆదాయంలో కొంత భాగాన్ని ప్రతినెలా ఎమర్జెన్సీ ఫండ్‌కు తప్పక కేటాయించాలి. దీనివల్ల అత్యవసరాల్లో మీరు ఒత్తిడికి గురికావాల్సిన పరిస్థితి ఎదురుకాదు.
  • ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత : ఇల్లు కొనడం, వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆర్థిక భరోసాతో పదవీ విరమణ చేయడం వంటి జీవిత లక్ష్యాలు చాలా మందికి ఉంటాయి. బడ్జెట్ తయారీ వల్ల ఈ లక్ష్యాలను సాధించే దిశగా మీరు ఎంత దూరం పయనించారు అనే దానిపై క్లారిటీ వస్తుంది.

ఖర్చులపై కమాండ్ వస్తుంది
మీ ఖర్చులు ఏమిటి? ఏయే విభాగాలపై ప్రతినెలా ఖర్చు చేస్తున్నారు? అనే అంశాలపై మీకు క్లారిటీ రావాలంటే బడ్జెట్​ను అంచనా వేసుకోవాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు భవిష్యత్తులో తెలివైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవచ్చు. అనవసర ఖర్చులను గుర్తించి, వాటిని ఆపేసి, అదే డబ్బును రుణ చెల్లింపులు, పొదుపులు లేదా ఇతర ఆర్థిక లక్ష్యాల వైపు మళ్లించవచ్చు. ఉదాహరణకు నిత్యావసరాల కొనుగోలు, మెడిసిన్స్ కొనుగోలు వంటి ఖర్చులను మనం ఆపలేం. కానీ వాటిలో కొంత డిస్కౌంట్ వచ్చేలా చేసుకోగలం. బడ్జెటింగ్ క్రమంలో ఇలాంటి ఖర్చులను గుర్తించి వాటిపై ఫోకస్ పెంచాలి. తద్వారా మీ పొదుపులు మరింత పెరుగుతాయి. పెట్టుబడి శక్తి ఇనుమడిస్తుంది.

మీ ఖర్చుల ప్రకారం ప్లాన్ చేయండి
బడ్జెట్‌ను చక్కగా రూపొందించుకునేందుకు మీరు మీ ఖర్చులపై స్పష్టమైన అవగాహనకు రావాలి. ఏయే వస్తువులు/ఉత్పత్తులు, సేవలపై ఎంతమేర ఖర్చుపెడుతున్నారు అనేది తెలుసుకోవాలి. వాటిని కింది విధంగా విభజించుకోవాలి. తద్వారా మన ఆదాయం నుంచి ఏయే విభాగాలకు ఎంత మొత్తాన్ని కేటాయించాలనేది నిర్ణయించుకోవచ్చు.

  • కిరాణా : ఇందులో ఆహారం, పానీయాలు, గృహావసరాల ఖర్చులు ఉంటాయి.
  • వినోదం : ఇందులో సినిమాలు, అభిరుచులు, సభ్యత్వాలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి.
  • డైనింగ్ అవుట్ : ఇందులో రెస్టారెంట్ భోజనం, టేకౌట్, డెలివరీ సేవల ఖర్చులు ఉంటాయి.
  • రవాణా : ఇందులో ఇంధనం, ప్రజా రవాణా, కారు నిర్వహణ, పార్కింగ్‌ ఖర్చులు ఉంటాయి.
  • షాపింగ్ : ఇందులో దుస్తులు, ఉపకరణాలు, అనవసర వస్తువుల కొనుగోళ్లు ఉంటాయి.
  • వ్యక్తిగత సంరక్షణ : ఇందులో మీ పర్సనల్ కేర్, బాడీ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. జుట్టు కత్తిరింపు ఖర్చులు, జిమ్ మెంబర్‌షిప్‌ ఖర్చులు, సౌందర్య ఉత్పత్తుల కొనుగోలు ఖర్చులు ఈ కేటగిరీలోకి వస్తాయి.

పర్సనల్ ఫైనాన్స్ నైపుణ్యాలకు పదును
బడ్జెట్‌ను తయారు చేయడం కష్టతరమైన అంశమని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది ఇప్పుడు చాలా సులభం. ఇందుకోసం మనం ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్‌‌ను వాడొచ్చు. గూగుల్ ప్లే స్టోరీ నుంచి బడ్జెట్ మేకింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిలో మనం ఆదాయం, అప్పులు, పొదుపులు, రుణాలు, ఖర్చులు, పెట్టుబడులు సహా మరెన్నో విభాగాలను క్రియేట్ చేసుకోవచ్చు. వాటిలో లావాదేవీల వివరాలను నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికను ఆ యాప్స్‌లోనే సిద్ధం చేసుకోవచ్చు. బడ్జెట్‌ను తయారు చేసుకోవడం వల్ల మీ పర్సనల్ ఫైనాన్స్ నైపుణ్యాలు పెరుగుతాయి. మీ ఆర్థిక నిర్ణయాలలో పరిపక్వత, దూరదృష్టి ప్రతిబింబిస్తుంది. మీ ఆర్థిక లక్ష్యాలను, జీవిత స్వప్నాలను సాకారం చేసుకోవడానికి ఈ మార్పు దోహదం చేస్తుంది. అప్పుల భారాన్ని తగ్గించుకుంటూ, రాబడిని అందించే పెట్టుబడులను పెంచుకుంటూ ముందుకుసాగితే మీ ఆర్థిక లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి.

మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary

భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం - పక్కాగా ప్లాన్ చేసుకోండిలా! - Personal Financial Planning

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.